OPPO Reno: 'ఒప్పో రెనో' స్మార్ట్‌ఫోన్ ఎందుకు కొనాలి? 8 కారణాలివే...

OPPO Reno 10 X Zoom | మ్యూజిక్ కాన్సర్ట్స్, బీచ్ లేదా వన్యప్రాణుల అభాయరణ్యంలో ఫోటోలు తీసేందుకు ఈ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ హైక్వాలిటీ 10X జూమ్ ఫోటోస్ తీయగలదు.

news18-telugu
Updated: May 28, 2019, 3:20 PM IST
OPPO Reno: 'ఒప్పో రెనో' స్మార్ట్‌ఫోన్ ఎందుకు కొనాలి? 8 కారణాలివే...
OPPO Reno: 'ఒప్పో రెనో' స్మార్ట్‌ఫోన్ ఎందుకు కొనాలి? 8 కారణాలివే... (image: OPPO)
news18-telugu
Updated: May 28, 2019, 3:20 PM IST
డీఎస్ఎల్ఆర్ కెమెరా స్థాయిలో ఫోటోలు తీసే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? చీకట్లో దూరం నుంచైనా క్లారిటీతో ఫోటోలు తీయాలనుకుంటున్నారా? ఇక మీరేం ఆలోచించాల్సిన అసరం లేదు. 10X జూమ్‌తో ఫోటోలు తీయగల 'ఒప్పో రెనో' రిలీజైంది. అద్భుతమైన నైట్ మోడ్ క్లారిటీ, పర్‌ఫెక్ట్ సెల్ఫీ, సూపర్ టెలిఫోటోతో వైడ్ యాంగిల్ కెమెరా లెన్సెస్... ఇలా ఒప్పో రెనో ప్రత్యేకతలెన్నో. రెనో 10X హైబ్రిడ్ జూమ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. హై క్వాలిటీతో దూరంలో ఉన్న దృశ్యాలను కూడా చిత్రీకరించొచ్చు. మ్యూజిక్ కాన్సర్ట్స్, బీచ్ లేదా వన్యప్రాణుల అభాయరణ్యంలో ఫోటోలు తీసేందుకు ఈ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ హైక్వాలిటీ 10X జూమ్ ఫోటోస్ తీయగలదు. మీరు ఒప్పో రెనో కొనడానికి 10X హైబ్రిడ్ జూమ్ ఒక్కటే కారణం కాదు. ఆకట్టుకునే మరెన్నో ఫీచర్లున్నాయి. అసలు 'ఒప్పో రెనో' ఎందుకు కొనాలి? 8 కారణాలివే తెలుసుకోండి.

1. బిగ్ స్క్రీన్
ఒప్పో రెనో 10X హైబ్రిడ్ జూమ్‌లో 6.6 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 స్క్రీన్ మరో ప్రత్యేకత. ఫుల్‌హెచ్‌డీ+ రెజల్యూషన్‌తో ఫుల్‌స్క్రీన్ డిస్‌ప్లే పనోరమిక్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది. హానిచేసే బ్లూలైట్‌ను తగ్గిస్తుంది. 8% తక్కువ స్క్రీన్ పవర్ ఉపయోగించుకుంటుంది.

 OPPO Reno release, OPPO Reno india release, OPPO Reno smartphone, OPPO Reno price, OPPO Reno features, OPPO Reno specifications, OPPO Reno 10 X Zoom, OPPO Reno 10 X camera, best camera phones, ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్, ఒప్పో రెనో ధర, ఒప్పో రెనో ఫీచర్స్, ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్, ఒప్పో రెనో 10 ఎక్స్‌ జూమ్‌, ఒప్పో రెనో 10 ఎక్స్‌ కెమెరా, బెస్ట్ కెమెరా ఫోన్
(image: OPPO)




2. వేగం... సురక్షితం...
ఒప్పో రెనోలో హిడెన్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ 2.0 ఉండటం మరో ప్రత్యేకత. ఓలెడ్ సెల్ఫ్ లైటింగ్ ఫీచర్ ద్వారా ఫింగర్ ప్రింట్ ఇమేజెస్‌ను సెన్సార్‌కు పంపిస్తుంది. స్క్రీన్-టు-బాడీ రేషియో కూడా ఎక్కువే. గతంలో వచ్చిన స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ 2.0 వేగం 20% నుంచి 30% ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఇది.

3. పటిష్టం, ఆకర్షణీయం
Loading...
రెనో ఫ్రంట్, రియర్ బాడీ ఆకర్షణీయంగా ఉంటుంది. రియర్ కెమెరాలు కార్నింగ్ గొరిల్లా 3డీ గ్లాస్ లోపలికి ఉంటాయి. సరిగ్గా ఫోన్ మధ్యలో ఏర్పాటు చేసిన కెమెరాలు అనుసంధానించినట్టు కనిపిస్తాయి. ఇక రెనో 10X జూమ్ మరో ఆకర్షణ.

4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌
ఒప్పో రెనోలో అల్ట్రా నైట్ మోడ్ 2.0 ఉంది. దాంతో పాటు రెనో 10X ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. మీరు నైట్ పోర్ట్‌రైట్ తీసుకుంటే చీకట్లోంచి మనిషి మొహాన్ని క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్‌రైట్‌ను అందంగా చిత్రీకరిస్తుంది. డాజిల్ కలర్ మోడ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో సీన్‌లోని కలర్స్‌ని కచ్చితంగా చిత్రీకరిస్తుంది. ఒప్పో రెనోతో మ్యాగజైన్ లెవెల్ పోర్ట్‌రైట్స్ కూడా తీయొచ్చు.

OPPO Reno release, OPPO Reno india release, OPPO Reno smartphone, OPPO Reno price, OPPO Reno features, OPPO Reno specifications, OPPO Reno 10 X Zoom, OPPO Reno 10 X camera, best camera phones, ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్, ఒప్పో రెనో ధర, ఒప్పో రెనో ఫీచర్స్, ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్, ఒప్పో రెనో 10 ఎక్స్‌ జూమ్‌, ఒప్పో రెనో 10 ఎక్స్‌ కెమెరా, బెస్ట్ కెమెరా ఫోన్
(image: OPPO)


5. మూవీ షూటింగ్
ఒప్పో రెనో 10X జూమ్ 4కే వీడియో షూటింగ్ సపోర్ట్‌చేస్తుంది. ఆడియో ఫోకస్ టెక్నాలజీ కూడా ఉంది. ఫోన్‌లో ఉన్న మైక్రోఫోన్స్ 360 డిగ్రీల్లో శబ్దాలను స్పష్టంగా రికార్డ్ చేస్తుంది. ప్రొఫెషనల్ మూవీ క్వాలిటీ కనిపిస్తుంది. అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం స్టీరియో స్పీకర్స్+డాల్బీ ఆట్మస్ ఉన్నాయి.

6. సెల్ఫీలు అద్భుతం
రెనోలోని 16 మెగాపిక్సెల్ ఏఐ బ్యూటీ కెమెరాతో సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో కూడా ఫోటోల్లో మీ చర్మం మరింత సహజంగా కనిపిస్తుంది. మీ వెనుక ఉండే లైట్‌తో పాటు మీ మొహంపై ఉండే వెలుతురును కూడా ఆప్టిమైజ్ చేయగలదు. పోర్ట్‌రైట్స్, సీనరీ స్పష్టంగా చిత్రీకరిస్తుంది.

 OPPO Reno release, OPPO Reno india release, OPPO Reno smartphone, OPPO Reno price, OPPO Reno features, OPPO Reno specifications, OPPO Reno 10 X Zoom, OPPO Reno 10 X camera, best camera phones, ఒప్పో రెనో స్మార్ట్‌ఫోన్, ఒప్పో రెనో ధర, ఒప్పో రెనో ఫీచర్స్, ఒప్పో రెనో స్పెసిఫికేషన్స్, ఒప్పో రెనో 10 ఎక్స్‌ జూమ్‌, ఒప్పో రెనో 10 ఎక్స్‌ కెమెరా, బెస్ట్ కెమెరా ఫోన్
(image: OPPO)


7. శక్తివంతమైన ఫోన్
రెనో 10 ఎక్స్‌ జూమ్‌లో స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్ ఉంది. VOOC 3.0 ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం ఉంటుంది. జీపీఎస్‌లో లేటెస్ట్ L1+L5 డ్యుయెల్ ఫ్రీక్వెన్సీ ఉంది. పొజిషన్‌ను కచ్చితంగా గుర్తించగలదు.

8. గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్
గేమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఫోన్ ఇది. ఇందులో గేమ్ బూస్ట్ 2.0 ఉంది. గేమ్ ఫ్రేమ్ రేట్‌తో పాటు స్టెబిలిటీని పెంచుతుంది. మీరు నిరంతరాయంగా గేమ్స్ ఆడుతున్నా టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటుంది. ఓవర్ హీట్ కాకుండా చూస్తుంది. మల్టీ-మైక్రోఫోన్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ వాయిస్ కాల్స్‌లో నాయిస్ వినిపించకుండా చేస్తుంది.

ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ మే 28న లాంఛైంది. కానీ ఈ ఫోన్ లాంఛింగ్ కంటే ముందు నుంచే టెక్ లవర్స్‌ను ఆకట్టుకోవడం విశేషం.

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

TikTok Phone: త్వరలో టిక్‌టాక్ ఫోన్... రిలీజ్ చేయనున్న బైట్‌డ్యాన్స్

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?

IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...