మోస్ట్ పాపులర్ ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్ (Software) సూట్స్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (Microsoft Office) నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలతో పాటు కోట్లాది మంది కంప్యూటర్ (Computer) యూజర్లు స్ప్రెడ్ షీట్స్, వర్డ్, పవర్‌పాయింట్ తదితర ఫీచర్లన్నింటి కోసం ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌నే వినియోగిస్తుంటారు. అయితే ఫుల్ పవర్డ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వెర్షన్ కోసం చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అంత మొత్తంలో డబ్బులు చెల్లించే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి యూజర్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు బదులు 7 ఆల్టర్నేటివ్ టూల్స్ వాడుకోవచ్చు. ఇవి MS ఆఫీస్ లాంటి ఫీచర్లను తక్కువ ధరకే లేదా ఉచితంగా అందిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
1. గూగుల్ వర్కర్ స్పేస్ (Google Work Space)
గూగుల్ వర్క్ స్పేస్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. అలాగే ఇది ఫైల్స్, మెయిల్స్, అటాచ్ మెంట్స్ స్టోర్ చేసేందుకు 15 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది. వర్క్ స్పేస్‌లో గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ వంటి చాలా గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇవి వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ లాగా పనిచేసే గూగుల్ డ్రైవ్ కూడా ఉంటుంది.
Smartphones with wireless charger: వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ పది ఫోన్లపై ఓ లుక్కేయండి
2. యాపిల్ ఐవర్క్ (Apple iWork)
మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు మరో చక్కటి ఆల్టర్నేటివ్ ఐవర్క్. ఇది మ్యాక్, ఐఫోన్, ఐపాడ్ వంటి వంటి యాపిల్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఐవర్క్ వెబ్ వెర్షన్ కూడా ఉంటుంది కానీ ఇందులో ఫీచర్లు పరిమితంగా ఉంటాయి. ఇది వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లకు బదులు పేజీస్, నంబర్స్, కీనోట్స్ అనే ఫీచర్లు ఆఫర్ చేస్తుంది.
3. డబ్ల్యూపీఎస్ ఆఫీస్ (WPS Office)
డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అచ్చం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాగానే ఉంటుంది. ఇది సేమ్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్నట్లుగా యూజర్ ఎక్స్పీరియన్స్ కల్పిస్తుంది. ట్యాబ్స్ లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఫైల్ ని ఒక్కటే విండోలో ఓపెన్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. ఇది విండోస్ కి సాఫ్ట్‌వేర్ గా అందుబాటులో ఉంది. మ్యాక్, లైనెక్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు కూడా యాప్ వెర్షన్ లో అందుబాటులో ఉంటుంది. డబ్ల్యూపీఎస్ ఓల్డ్ వెర్షన్ కూడా యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబ్ల్యూపీఎస్ ఆఫీస్ లోని ఫీచర్లను ఫ్రీగా వినియోగించవచ్చు కానీ వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి.
Noise Buds Prima: నాయిస్ బడ్స్ ప్రైమా TWS ఇయర్‌బడ్స్ లాంచ్ .. 42 గంటల బ్యాటరీ లైఫ్‌తో పాటు మరెన్నో ఫీచర్లు..
4. లైబ్రఆఫీస్ (LibreOffice)
మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు బదులుగా మీరు లైబ్రఆఫీస్ అనే ఆఫ్‌లైన్ టూల్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో రియల్ టైం కొలాబరేషన్, క్లౌడ్ స్టోరేజ్, సింక్, మెయిల్, క్యాలెండర్ వంటి ఫీచర్లు తప్ప మిగతావన్నీ ఉంటాయి. ఇది విండోస్, మ్యాక్, లైనెక్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
5. డ్రాప్‌బాక్స్ పేపర్ (Dropbox Paper)
వర్డ్ ప్రాసెసింగ్ ఫీచర్ కోసం డ్రాప్‌బాక్స్ పేపర్ టూల్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. డ్రాప్‌బాక్స్ అకౌంటు ఉన్నవారు 2జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు. ఈ టూల్ సహాయంతో ఆఫీస్ సపోర్ట్ చేసే డాక్స్, పీడీఎఫ్ వంటి ఫార్మాట్లలో ఫైల్స్ ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.
New Car: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే.. వీటన్నింటినీ ఓ సారి తప్పక చెక్ చేయండి..
6. జోహో డాక్స్(Zoho Docs)
జోహో డాక్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ క్లౌడ్ ఆధారిత టూల్ రైటర్, షీట్, షో అనే ఫీచర్లను వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ బదులుగా అందిస్తుంది. పీడీఎఫ్ తో సహా మిగతా ఆఫీస్ ఫైల్ ఫార్మాట్లకు ఇది సపోర్ట్ చేస్తుంది.
7. ఫ్రీ ఆఫీస్ (Free Office)
ఫ్రీ ఆఫీస్ అనే టూల్‌ను హోం, ఆఫీస్ యూజర్లు ఉచితంగా వినియోగించవచ్చు. ఇది విండోస్, మ్యాక్, లైనెక్స్, ఆండ్రాయిడ్ వెర్షన్ లలో అందుబాటులో ఉంది. డాక్స్, పీపీటీఎక్స్ వంటి ఫార్మాట్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. పాత ఆఫీస్ ఫైల్ ఫార్మాట్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.