హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

6G Network: 5G కన్నా 6జీ స్పీడ్ ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా?

6G Network: 5G కన్నా 6జీ స్పీడ్ ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా?

6G Network: 5G కన్నా 6జీ స్పీడ్ ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

6G Network: 5G కన్నా 6జీ స్పీడ్ ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

6G Network | సాంసంగ్ 6జీ టెక్నాలజీపై పరిశోధనలు జరిపింది. 5జీ నెట్వర్క్ కన్నా 6జీ నెట్వర్క్ ఎన్ని రెట్లు వేగమో తేల్చింది.

ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే ఎంతో ఖరీదు. 2జీ నెట్ కోసం గంటల తరబడి వేచి చూసిన రోజులు సైతం ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 3జీ, 4జీ వచ్చింది. 5జీ కూడా వచ్చేస్తోంది. ప్రస్తుతం 4జీ నెట్వర్క్ ఫోన్లు అంతటా వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే 5జీ టెక్నాలజీ వస్తోంది. త్వరలో 6జీ సైతం అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. 6జీపై రిసెర్చ్ చేసింది. 5జీతో పోలిస్తే ఇది 50 రేట్లు వేగంగా ఉంటుందని తేలినట్లు సంస్థ మంగళవారం పేర్కొంది. ఈ విషయాన్ని శాంసంగ్ ఉపాధ్యక్షుడు, ప్రొడక్ట్ వ్యూహకర్త వోనిల్ రోహ్ తెలిపారు.

Google App Crashing: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ క్రాష్‌ అవుతోందా... వెంటనే ఇలా చేయండి

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... ఈ రెండు ప్లాన్స్‌పై బెనిఫిట్స్ మారాయి

5జీ నెట్వర్క్ లో సెకనును 5.23 జీబీపీఎస్ వేగాన్ని సాధించినట్లు వోనిల్ తెలిపారు. 6జీ విభిన్నమైందని, ఇది అభివృద్ధి చెందుతున్న అనుభవాలు, సేవల నమూనాను పూర్తిగా రూపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. "6జీ వేగాన్ని అంచనా వేయడం మంచి విషయం. వాస్తవానికి మేము ఇప్పటికే టెరాహెర్జ్ కమ్యూనికేషన్లను ప్రదర్శించాం. ఇది మా 6జీ పురోగతికి నిదర్శనం" అని ఎలక్ట్రానిక్స్ నెట్వర్క్ బిజినెస్ ఎస్వీపీ సున్ఘ్యున్ చోయ్ చెప్పారు. ప్రెజెంటేషన్ స్లైడ్ విషయంలో 6జీ వేగం.. 5జీ కంటే 50 రెట్లు ఎక్కువగా ఉందని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే దీనిపై సంస్థ శ్వేత పత్రం కూడా విడుదల చేసింది. 6జీ స్టాండార్డ్‌ను 2028నాటికి అందుబాటులోకి తీసుకురావచ్చని శాంసంగ్ ఆశిస్తోంది. 2030 నాటికి ఇది మాస్ కమర్షియలైజేషన్ అవుతుందని భావిస్తోంది.

Lava Probuds: రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్ రూ.1 ధరకే సొంతం చేసుకోండి ఇలా

Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

ఎక్కువ భాగాన్ని వర్చువలైజ్ చేసిన కంపెనీ


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విజువల్ టెక్నాలజీ, ఫ్యూచర్ టెక్నాలజీల భద్రత వంటి నూతన రంగాలను కంపెనీ నిరంతరం అన్వేషిస్తోందని చోయ్ తెలిపారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్‌టైన్‌మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను పెంచుతుందని అన్నారు. నెట్వర్క్ కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తన సిస్టంలో ఎక్కువ భాగాన్ని వర్చువలైజ్ చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది. భారత్‌లో కోట్ల మంది కస్టమర్ల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ వర్చువలైజ్డ్ కోర్ నెట్వర్క్‌ను నిర్వహిస్తున్నామని శాంసంగ్ గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ వూజునే కిమ్ తెలిపారు.

First published:

Tags: 5G, 5G Smartphone, Samsung