Tecno:5 కెమెరాల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.834కే..ఒకసారి చార్జింగ్ పెడితే 4 రోజులు ఫుల్‌చార్జ్

తాజాగా ఈ Tecno కంపెనీ తక్కువ ధరలో ఈ వారం, టెక్నో స్పార్క్ గో పవర్ 2 (Tecno Spark Power 2) స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. టెక్నో ఈ ఫోన్ ధర కేవలం 9,999 రూపాయలు, ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కోసం కేటాయించారు. ఈ ఫోన్ యొక్క మొదటి సెల్‌ను జూన్ 23 న ఫ్లిప్‌కార్ట్‌లో కంపెనీ ఉంచింది.

news18-telugu
Updated: June 22, 2020, 7:45 PM IST
Tecno:5 కెమెరాల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.834కే..ఒకసారి చార్జింగ్ పెడితే 4 రోజులు ఫుల్‌చార్జ్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
బడ్జెట్ ఫోన్ గురించి ప్రస్తుతం కస్టమర్లు నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం కు డిమాండ్ పెరిగింది. దీంతో స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం బడ్జెట్ ధరలోనే మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ లను తయారు చేస్తున్న కంపెనీల్లో టెక్నో ముందువరుసలో ఉంది. తాజాగా ఈ Tecno కంపెనీ తక్కువ ధరలో ఈ వారం, టెక్నో స్పార్క్ గో పవర్ 2 (Tecno Spark Power 2) స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. టెక్నో ఈ ఫోన్ ధర కేవలం 9,999 రూపాయలు, ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కోసం కేటాయించారు.

ఈ ఫోన్ యొక్క మొదటి సెల్‌ను జూన్ 23 న ఫ్లిప్‌కార్ట్‌లో కంపెనీ ఉంచింది. దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. టెక్నో స్పార్క్ పవర్ 2(Tecno Spark Power 2 ) లో 7 అంగుళాల పెద్ద డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో ప్రత్యేకమైన ఫీచర్లతో పాటు 6000 mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది.

అంతేకాదు 7-అంగుళాల HD + వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో పి 22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని రిజల్యూషన్ 720x1640 పిక్సెల్స్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారంగా HIOS 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఫోన్‌లో 2GHz మీడియాటెక్ హెలియో P22 MTK6762 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది, దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256 జీబీకి పెంచవచ్చు.

కెమెరా గురించి మాట్లాడుకుంటే.. ఫోన్ వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. దీనికి 16 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా ఉండగా, సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా, మూడవ కెమెరా మైక్రో కెమెరా. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా కేటాయించారు. అంటే మొత్తం 5 కెమెరాలు ఉన్నాయి. పవర్ కోసం, ఫోన్6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఫోన్ 4 రోజులు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ అతి తక్కువ ఈఎంఐ రూ.834కే పొందే కొనుగోలు చేసే వీలుంది. (No cost EMI ₹834/month)
First published: June 22, 2020, 7:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading