హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Indian CEOs: టాప్ గ్లోబల్ టెక్ కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు.. జాబితాలో ఉన్నది వీరే..

Indian CEOs: టాప్ గ్లోబల్ టెక్ కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు.. జాబితాలో ఉన్నది వీరే..

టాప్ గ్లోబల్ టెక్ కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు.. జాబితాలో ఉన్నది వీరే..

టాప్ గ్లోబల్ టెక్ కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు.. జాబితాలో ఉన్నది వీరే..

Indian CEOs: ట్విట్టర్‌కు ఓ భారతీయుడు సీఈవో కావడం మనందరికీ గర్వకారణం. ఈ క్రమంలో మొత్తం ఎన్ని గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారతీయులు సీఈవోగా కొనసాగుతున్నారో తెలుసుకుందాం.

సాంకేతిక ప్రపంచంలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న అగ్రసంస్థల్లో భారతీయులు అత్యున్నత హోదాలను చేజిక్కించుకున్నారు. ఈ టెక్ దిగ్గజాలకు భారతీయులే సారథులుగా ఉండి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నారు. తాజాగా మరో భారతీయుడు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు సీఈఓగా నియమితులయ్యారు. ట్విట్టర్‌ (Twitter)  కో-పౌండర్ జాక్‌ డోర్సీ (Jack Dorsey) తాజాగా సీఈఓ హోదా నుంచి తప్పుకోవడంతో భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ ఆ బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ గా పేరొందిన ట్విట్టర్‌కు ఓ భారతీయుడు సీఈవో కావడం మనందరికీ గర్వకారణం. ఈ క్రమంలో మొత్తం ఎన్ని గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారతీయులు సీఈవోగా కొనసాగుతున్నారో తెలుసుకుందాం.

1. ట్విట్టర్ (Twitter) - పరాగ్‌ అగర్వాల్‌

ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు.

Parag Agrawal: గూగుల్​ ట్రెండింగ్​లో ట్విట్టర్​ కొత్త సీఈవో పరాగ్​ అగర్వాల్​.. అతని గురించి భారతీయ నెటిజన్లు ఏం వెతికారో​ తెలుసా?2. గూగుల్ (Google) - సుందర్ పిచాయ్

గూగుల్ సంస్థకు మన భారతీయుడు సుందర్​ పిచాయ్​ సీఈవోగా కొనసాగుతున్నారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ కు కూడా ఆయనే సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న సీఈవోల్లో ఒకరిగా సుందర్ నిలిచారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టిపెరిగిన సుందర్ పిచాయ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ నుంచి బీ.టెక్ పూర్తి చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ(MS) పూర్తి చేశారు. వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అతను 2015 నుంచి గూగుల్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

Mobile Security: మీ ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డొద్దంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే!


3. మైక్రోసాఫ్ట్ (Microsoft) - సత్య నాదెళ్ల

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఈ ఏడాది జూన్ 16న నియమితులయ్యారు సత్య నాదెళ్ల. అంతకుముందు అంటే 2014 ఫిబ్రవరి 4వ తేదీన మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్‌, సీఈవోగా కొనసాగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. అతను 1990లో యూఎస్ లోని విస్కాన్సిన్-మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. ఈయన సన్ మైక్రోసిస్టమ్స్‌ ద్వారా తన కెరీర్ ని ప్రారంభించారు.

No Password: ఇక పాస్‌వ‌ర్డ్ ఉండ‌దు.. అయినా మీ ఎకౌంట్ సేఫ్.. మైక్రోసాఫ్ట్ కొత్త ఆలోచ‌న‌


4. అడోబ్​ (Adobe Systems) - శంతను నారాయణ్

హైదరాబాద్‌లో జన్మించిన శంతను నారాయణ్ 2007 నుంచి అడోబ్​ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. ఈ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన తన తెలివి ప్రతిభతో ముందుండి నడిపిస్తున్నారు. సృజనాత్మక డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్‌వేర్ ఫ్రాంచైజీలను పెంచేస్తూ కంపెనీని బాగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అడోబ్​ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావడానికి ఆయనే కారణం అంటుంటారు. నారాయణ్ 1998లో అడోబ్‌లో వరల్డ్ వైడ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అంతకుముందు నారాయణ్ 1986లో సిలికాన్ వ్యాలీ స్టార్ట్-అప్ మెసర్‌క్స్ ఆటోమేషన్ సిస్టమ్స్‌తో పనిచేశారు. తర్వాత 1989 నుంచి 1995 వరకు యాపిల్ సంస్థలో పని చేశారు. 1996లో అతను పిక్ట్రా ఇంక్. అనే కంపెనీని సహ-స్థాపించారు. ఇది ఇంటర్నెట్‌లో డిజిటల్ ఫొటో షేరింగ్ విధానానికి మార్గం సుగమం చేసింది.

Smartphone Tips: పొరపాటున ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఇలా తిరిగి పొందొచ్చు5. ఐబీఎం (IBM) - అరవింద్ కృష్ణ

భారతీయ సంతతికి చెందిన అరవింద్​ కృష్ణ టెక్​ దిగ్గజం ఐబీఎంకు జనవరి 2020లో సీఈఓగా ఎంపికయ్యారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు. 1990లలో కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీ ఐబీఎంలో చేరారు. గిన్ని రోమెట్టి(Ginni Rometty) ఐబీఎం సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో జనవరి 2020లో ఐబీఎం సీఈవోగా అరవింద్​ కృష్ట నియమితులయ్యారు. గతంలో ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జనరల్ మేనేజర్ హోదాలో కొనసాగారు. ఆపై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఐబీఎం రీసెర్చ్‌గా.. తరువాత ఐబీఎం క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. కృష్ణ కంపెనీ ప్రగతికి, విస్తరణకు ఒక మార్గదర్శకులుగా నిలిచారు.

చీకటిలో మెరిసే OnePlus Nord 2 x PAC-MAN ఎడిషన్ ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది.6. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ (Palo Alto Networks) - నికేశ్ అరోరా

భారతదేశంలోని ఘజియాబాద్‌లో జన్మించిన నికేశ్ అరోరా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. అతను సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్‌గా సాఫ్ట్‌బ్యాంక్ ఇంటర్నెట్ అండ్ మీడియా, ఇంక్. (SIMI) సీఈఓగా కూడా పనిచేశారు. అతను 1989లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వారణాసి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఈయన గూగుల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పనిచేశారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

Published by:John Kora
First published:

Tags: Google, Microsoft, Twitter

ఉత్తమ కథలు