హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Chromebooks: మీ పిల్లల ఆన్​లైన్​ క్లాసుల కోసం బెస్ట్​ డివైజ్​ వెతుకుతున్నారా?.. అయితే ఈ​ క్రోమ్​బుక్​లను పరిశీలించండి..

Chromebooks: మీ పిల్లల ఆన్​లైన్​ క్లాసుల కోసం బెస్ట్​ డివైజ్​ వెతుకుతున్నారా?.. అయితే ఈ​ క్రోమ్​బుక్​లను పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మిగతా డివైజెస్​తో పోలిస్తే బడ్జెట్​ ధరలోనే లభించే క్రోమ్‌బుక్స్​ మీ పిల్లల ఆన్​లైన్​ క్లాసులకు బాగా ఉపయోగపడతాయి. ఇవి అన్ని కంప్యూటింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా, సరసమైన ధరలోనే లభిస్తుండటం విశేషం. అంతేకాదు, వీటిని ల్యాప్‌టాప్స్​ వలే పోర్టెబుల్​ డివైజ్​గా కూడా వాడుకోచ్చు.మార్కెట్​లో వివిధ బ్రాండ్లకు చెందిన క్రోమ్​బుక్స్​​ అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి కారణంగా విద్యాబోధన అంతా ఆన్​లైన్​లోనే కొనసాగుతోంది. దీంతో, ఆన్​లైన్​ క్లాసులకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. అయితే, మిగతా డివైజెస్​తో పోలిస్తే బడ్జెట్​ ధరలోనే లభించే క్రోమ్‌బుక్స్​ మీ పిల్లల ఆన్​లైన్​ క్లాసులకు బాగా ఉపయోగపడతాయి. ఇవి అన్ని కంప్యూటింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా, సరసమైన ధరలోనే లభిస్తుండటం విశేషం. అంతేకాదు, వీటిని ల్యాప్‌టాప్స్​ వలే పోర్టెబుల్​ డివైజ్​గా కూడా వాడుకోచ్చు. మార్కెట్​లో వివిధ బ్రాండ్లకు చెందిన క్రోమ్​బుక్స్​​ అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.

లెనోవా ఐడియాప్యాడ్ డ్యూయెట్ క్రోమ్​బుక్​

లెనోవా కంపెనీకి చెందిన ఐడియాప్యాడ్ డ్యూయెట్​ క్రోమ్​బుక్​ మీ పిల్లల ఆన్​లైన్​ క్లాసులకు సరిగ్గా సరిపోతుంది. ఇది10.1-అంగుళాల FHD డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 4GB ర్యామ్​, 128GB స్టోరేజ్‌ను అందించారు. ఈ డివైజ్​ను టాబ్లెట్, నోట్‌బుక్‌ రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది మీడియాటెక్​ హీలియో P60T ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ క్రోమ్​బుక్​ను రూ .26,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఆసుస్ క్రోమ్​బుక్​ సెలెరాన్ డ్యూయల్ కోర్

ఆసుస్ కంపెనీకి చెందిన​ సెలెరాన్ డ్యూయల్ క్రోమ్​బుక్​ మీ పిల్లల ఆన్​లైన్​ క్లాసులకు సరిగ్గా సరిపోతుంది. దీనిలో 4GB ర్యామ్/64GB స్టోరేజ్​ను అందించారు. ఇది 14- అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 720p HD వెబ్‌క్యామ్, బ్యాక్‌లిట్ కీబోర్ట్​ను అమర్చారు. ఈ క్రోమ్​బుక్​ రూ.23,999 ధర వద్ద లభిస్తుంది.

ఏసర్ క్రోమ్‌బుక్ 311

ఏసర్ క్రోమ్‌బుక్‌లో 1366 x 768 రిజల్యూషన్ డిస్​ప్లేతో వస్తుంది. దీనిలో 4GB RAM, 32GB ROM, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 600 వంటివి అందించారు. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, 4GB RAM, 32GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్​లో రూ .22,890 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

హెచ్​పి క్రోమ్​బుక్​ 11a

హెచ్​పి క్రోమ్​బుక్ 11a.. 11.6- అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో మీడియా టెక్​ MT8183 ప్రాసెసర్​ను అందించారు. ఇది 4GB RAM, 64GB EMMC స్టోరేజ్ ఆప్షన్షలో లభిస్తుంది. దీనిలో 45W టైప్-సి అడాప్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, HP ట్రూ విజన్ 720p HD వెబ్‌క్యామ్ వంటివి అందించారు. ఈ ల్యాప్‌టాప్​ను రూ. 22,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఏసర్ క్రోమ్​బుక్​ సెలెరాన్ డ్యూయల్ కోర్

ఏసర్ క్రోమ్‌బుక్ 11.6 -అంగుళాల హెచ్​డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB RAM, 16GB స్టోరేజ్​ను అందించారు. ఇది 3-సెల్ బ్యాటరీ, 45WHrs బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు, మిలిటరీ గ్రేడ్ డ్యూరబులిటీ ఫీచర్లతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్​లో దీన్ని రూ .23,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

హెచ్​పి క్రోమ్​బుక్​ 14A

హెచ్​పి క్రోమ్​బుక్​ 14A.. 14 అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. ఇది 4GB RAM, 64GB SSD స్టోరేజ్‌తో పాటు 256GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీన్ని ఆ​లైన్​లో రూ .26,979 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

First published:

Tags: Lenovo, School boy, Technology

ఉత్తమ కథలు