5G SMARTPHONE THERE IS NO CHANCE OF LAUNCHING A 5G SMARTPHONE IN INDIA FOR LESS THAN RS 10000 KNOW THE REASON GH VB
5G Smartphone: ఇండియాలో రూ.10,000 లోపు 5G స్మార్ట్ఫోన్ లాంచ్ అయ్యే అవకాశమే లేదు.. ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం
అన్ని ఫోన్ల లాగానే 5జీ స్మార్ట్ఫోన్లు కూడా రూ.10,000లోపు లాంచ్ అవుతాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఇప్పట్లో చవకైన ధరలకు 5జీ మొబైల్స్ లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఒకప్పుడు కెమెరా, ఇంటర్నెట్(Internet) వంటి బేసిక్ ఫీచర్లు(Features) ఉన్న ఫోన్స్ (Phones) కొనుగోలు చేయాలంటే చాలా మనీ వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 4జీ కనెక్టివిటీతో చక్కటి ఫీచర్లతో తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు (Smartphones) లభిస్తున్నాయి. ప్రస్తుతం 5జీ ఫోన్లు (5G Phones) మాత్రం పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంత అత్యధిక ధరలతో అమ్ముడు పోతున్నాయి. అయితే అన్ని ఫోన్ల లాగానే 5జీ స్మార్ట్ఫోన్లు(Smartphones0 కూడా రూ.10,000లోపు లాంచ్ అవుతాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఇప్పట్లో చవకైన ధరలకు 5జీ మొబైల్స్ లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. ఉత్తమ పనితీరు, మంచి కెమెరాలు ఉన్న క్వాలిటీ 5జీ ఫోన్(Phone) సొంతం చేసుకోవడానికి ఇప్పుడు మీరు రూ.20 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
5జీ నెట్వర్క్లకు సపోర్ట్ చేసే ఫోన్స్ రూ.20వేల లోపు అందుబాటులో ఉన్నాయి కానీ వీటిలో కొన్ని ఫీచర్లను అందించడం లేదు. మీరు 5జీ స్మార్ట్ఫోన్ను 20 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. కానీ ఈ ఫోన్లో అమోలెడ్ డిస్ప్లే లేకపోవచ్చు. లేదంటే వెనుకవైపు కెమెరాల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. పేలవమైన హార్డ్వేర్ అందించొచ్చు. దీనివల్ల ఆ ఫోన్ పర్ఫామెన్స్ చాలా పేలవంగా ఉంటుంది. నిజానికి మంచి 4జీ ఫోన్స్ కొనుగోలు చేయాలన్నా దాదాపు రూ.15 వేలు చెల్లించాల్సి వస్తోంది. అయితే, 2022లో బెస్ట్ 4జీ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసినా నష్టపోయినట్లు ఏం కాదు. ప్రత్యేకించి 5జీ ఫోన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనుగోలు చేస్తే మంచిదే!
ఇండియాలో 5జీ సేవలు కూడా లాంచ్ కాలేదు కాబట్టి 5జీ మొబైల్స్ ధరలు తగ్గేవరకు వెయిట్ చేయొచ్చు. లేదా మీ బడ్జెట్ను పెంచి 5జీ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు.
సరసమైన 5జీ స్మార్ట్ఫోన్ తక్కువ ధరలతో ఈ ఏడాది నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువ. ఇప్పటికీ టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఖరీదైనవిగానే ఉన్నాయి. రాబోయే 12 నెలల్లో 5జీ సర్వీసెస్ ప్రపంచమంతటా అందుబాటులోకి రాకపోతే 5జీ ఫోన్స్ ఉత్పత్తి, వాడకం అంతగా పెరగకపోవచ్చు. ఇక ఫోన్స్ తయారీపై కూడా అనేక బాహ్య కారకాలు నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. గ్లోబల్ చిప్ కొరత, ముడి పదార్థాల ధరలు, ఇతర బాహ్య కారకాలు ఈ రోజుల్లో ప్రతి కొన్ని నెలలకోసారి ఫోన్ ధరలను పెంచేలా కంపెనీలను బలవంతం చేస్తున్నాయి.
ఈ సంవత్సరం అనేక పరిశోధన అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో స్మార్ట్ఫోన్ సగటు అమ్మకపు ధర పెరిగింది. క్వాలిటీ ఫోన్స్ కొనుగోలు చేయడానికి ప్రజలు రూ.15,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. గత రెండేళ్లలో యావరేజ్ మొబైల్ సెల్లింగ్ ప్రైస్ 2-3 వేలకు పైగా పెరిగింది. దీనిబట్టి మొబైల్స్ రూ.10,000 లోపు 5జీ ఫోన్ను లాంచ్ చేయడం జరగకపోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది చివరి నాటికి తక్కువ ధరలతో 5జీ ఫోన్స్ రాకపోవచ్చని తెలుపుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.