5G Upgrades: ఇండియాలో 5G సేవలు అధికారికంగా లాంచ్ అయిన తర్వాత, ఈ నెట్‌వర్క్‌ను వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని ప్రభుత్వం, టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) సంస్థలు 5జీ సేవలను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎనిమిది నగరాల్లో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని ఎయిర్టెల్ ప్రకటించింది. జియో బీటా ట్రయల్ 5G సేవలను నాలుగు నగరాలలో ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే ఇండియన్ 5G సేవలకు యాపిల్ (Apple), శామ్సంగ్ (Samsung) ఫోన్లు సపోర్ట్ చేయవని సమాచారం.
ఇండియాలో చాలా మంది ఇప్పటికే 5G ఫోన్లు కొనుగోలు చేశారు. అయితే 5Gకి సపోర్ట్ చేసేలా మొబైల్ కంపెనీలు తమ ఫోన్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం యాపిల్(Apple), శామ్సంగ్(Samsung), షియోమి (Xiaomi) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లతో సమావేశం కానుంది. షియోమి, వివో వంటి బ్రాండ్లు ఇప్పటికే తమ ఫోన్లకు 5G సపోర్ట్‌ను అందించాయి. అయితే యాపిల్, శామ్సంగ్ మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ కంపెనీల డివైజ్‌లను కొత్త నెట్వర్క్ కంపాటబిలిటీకి అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం కోరనుంది.
రూ.40 వేలకు పైగా డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 4 ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు
* కంపెనీలతో సమావేశం
ప్రజలకు 5జీ సేవలను సజావుగా అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు, టెలికాం కంపెనీలతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. అన్ని కంపెనీలు భారతదేశంలో 5Gని సపోర్ట్ చేసేలా తమ ఫోన్లను అప్డేట్ చేశాయా? లేదా? అని నిర్ధారించడానికి టెక్ దిగ్గజాలతో ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది.
రూ.20 వేలలో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నారా..? ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి
* అన్ని ఫోన్లు సపోర్ట్ చేయవా?
ఎయిర్టెల్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. భారతదేశంలో యాపిల్, శామ్సంగ్ కంపెనీలు ఎక్కువగా మొబైల్స్ విక్రయిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎక్కువ వాటాను ఈ రెండు కంపెనీలు నియంత్రిస్తున్నాయి. అయితే ఈ కంపెనీల ఫోన్లు 5Gకి సపోర్ట్ చేయాలంటే సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాపిల్ ఇటీవల లాంచ్ చేసిన iPhone మోడల్‌లు ఏవీ భారతదేశం 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయలేవు. భారతదేశంలో 5G సేవలకు తమ డివైజ్‌లు సపోర్ట్ చేసేలా అప్డేట్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ బ్రాండ్లను కోరడానికి ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహిస్తోంది.
* కొన్ని నెలలు పట్టే అవకాశం
ఇండియా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 5G మిషన్‌లో యాపిల్ సపోర్ట్ లేకపోవడాన్ని సమస్యగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ ఐఫోన్ లైనప్‌ను ఇండియన్ 5G నెట్‌వర్క్‌లకు అనుకూలంగా మార్చడానికి కొన్ని నెలలు పట్టవచ్చని పేర్కొనడం గమనార్హం. ఫోన్లలోని ప్రధాన చిప్సెట్తో అనుసంధానించిన 5G మోడెమ్‌ను డివైజ్ తయారీదారు ఇంకా అన్‌లాక్ చేయలేదు. దీనికి టెలికాం ఆపరేటర్‌తో ఎటువంటి సంబంధం లేదు. షియోమి, వివో, రియల్మీ , వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు ఇప్పటికే భారతదేశంలో 5Gకి సపోర్ట్ చేసే డివైజ్‌లను లాంచ్ చేశాయి. ఇప్పుడు నెట్వర్క్ పరిధిని టెల్కోలు విస్తరించాల్సి ఉంది. దీనికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G, 5g smart phone, Smart phones, Technolgy