ఫాస్టెస్ట్ మొబైల్ నెట్‌వర్క్ 5G ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని భారత దేశ (India) వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే వారి నిరీక్షణకు అతి త్వరలోనే తెరపడే అవకాశముంది. ఈ నెలలోనే భారతదేశంలో 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Jio) సిద్ధమయ్యాయి. అంటే మరో వారం రోజుల్లో యూజర్లకు 5G సేవలు అందుబాటులోకి రావచ్చు. తాజా నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 29, 2022న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం అధికారికంగా 5Gని లాంచ్ చేయనుంది. 4G కంటే పది రెట్లు వేగవంతమైన 5G సేవలు దేశంలో ప్రారంభమైతే డిజిటల్ పనులన్నీ చిటికెలో చేసుకోవచ్చు. ముందుగా ఈ సేవలు 13 ప్రధాన నగరాల్లో రానున్నాయి. అవేంటో చూద్దాం.
ఇండియాలో దిగ్గజ టెలికాం కంపెనీలుగా రాణిస్తున్న ఎయిర్‌టెల్, జియో ఈ నెలాఖరులోగా 5G సేవలను తీసుకు రానున్నాయని సమాచారం. ఈ టెలికాం ఆపరేటర్లు కొన్నేళ్లుగా తమ 5G సేవలను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారత్‌లో 5G ఊహించిన సమయం కంటే త్వరగా అందుబాటులోకి వస్తుందన్నారు. దాని వేగం 4G నెట్‌వర్క్ కంటే 10 రెట్లు ఎక్కువ అని గుర్తు చేశారు.
* ఈ నగరాల్లో ముందుగా రానున్న 5G సేవలు
తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఇండియాలో 5G సేవలు దశలవారీగా అందుబాటులోకి వస్తాయి. మొదటి దశలో కేవలం 13 ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5G ఇంటర్నెట్ సేవలను లాంచ్ అవుతాయి. ఆ నగరాలు.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే.
ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇండియాలో 5G సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లెటర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. “స్పెక్ట్రమ్ వేలం ముగిసిన కొన్ని రోజుల్లోనే మేం స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తాం. అక్టోబర్ ప్రారంభం నుంచి 5G రోల్-అవుట్ జరుగుతుందని మేం ఆశిస్తున్నాం. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలోగా మేం దేశంలో 5G సేవలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెస్తాం,” అని వైష్ణవ్ గతంలోనే చెప్పారు. ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో డిజిటల్ ఇండియా ద్వారా అట్టడుగు స్థాయికి విప్లవాన్ని తీసుకువస్తున్న భారతదేశపు 'టెక్కేడ్ (Techad)' ఇక్కడ ఉందని ఈ డిజిటల్ యుగానికి కొత్త పదాన్ని వాడారు.
ఇది కూడా చదవండి : పొరపాటున డిలిట్ చేసిన వాట్సప్ మెసేజెస్ మళ్లీ పొందొచ్చు
* మీ ఫోన్ 5G కి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోండిలా
స్టెప్ 1: ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్‌కి వెళ్లాలి.
స్టెప్ 2: 'Wi-Fi & Networks' లేదా కనెక్షన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మొబైల్ నెట్‌వర్క్స్‌లో ‘నెట్‌వర్క్ మోడ్’ ఆప్షన్‌పై నొక్కాలి.
స్టెప్ 4: ఇప్పుడు ‘ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్’ ఆప్షన్ క్రింద అన్ని నెట్‌వర్క్స్ కనిపిస్తాయి. మీ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే, అది 2G/3G/4G/5Gగా లిస్ట్ చూపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.