Home /News /technology /

5G SERVICE IN INDIA WILL FIRST START IN 13 CITIES REVEALED HERE CHECK YOUR CITY IS AMONG THOSE CITIES VB

5G Network: ఈ 13 నగరాల్లో ముందుగా 5G సేవలు ప్రారంభం.. జాబితాలో మీ నగరం ఉందో లేదో చెక్ చేసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం మొబైల్ ఫోన్ లో 4జీ టెక్నాలజీని వాడుతున్న విషయం తెలిసిందే. అయితే 5జీతో మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నా.. 5జీ technology మాత్రం ఇంకా రాలేదు . భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ నడుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం మొబైల్ ఫోన్(Mobile Phone) లో 4జీ టెక్నాలజీని వాడుతున్న విషయం తెలిసిందే. అయితే 5జీతో మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతున్నా.. 5జీ technology మాత్రం ఇంకా రాలేదు . భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్(Trials) నడుస్తున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ చివరలో 5జీ టెక్నాలజీ(Technology) అందుబాటులో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 5జీ టెక్నాలజీపై గత రెండు సంవత్సరాల నుంచి ట్రయల్స్ నడుస్తున్నాయి. 5G స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో(Jio), వొడాఫోన్(Vodafone) ఐడియా మరియు ఎయిర్‌టెల్ 5G ట్రయల్ సమయంలో పాల్గొన్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త కంపెనీ అదానీ గ్రూప్ చివరిగా వేలంలోకి ప్రవేశించింది.

Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !


అదానీ డేటా నెట్‌వర్క్ అనేది 5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్న అదానీ గ్రూప్ కంపెనీ పేరు. దేశంలో 5G నెట్‌వర్క్ వాణిజ్య వినియోగం అక్టోబర్ 2022 నాటికి ప్రారంభమవుతుందని కొన్ని మీడియా సంస్థులు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి ప్లాన్ ధర ఎలా ఉంటుందనే విషయాలను మాత్రంర వెల్లడికాలేదు. ఇక ఈ 5జీ టెక్నాలజీ లాంచ్ కు ముందు మొదట ఇది ఏ నగరాల్లో అందుబాటులోకి వస్తుందో టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 5జీ టెక్నాలజీ మొదట 13 నగరాల్లో ప్రారంభం అవుతుందని తెలిపింది. ఆ లిస్ట్ ఇదే..



1. బెంగళూరు(Bangalore)
2. ఢిల్లీ(Delhi)
3. హైదరాబాద్(Hyderabad)
4. గురుగ్రామ్(Gurugram)
5. లక్నో(Lucknow)
6. పూణే(Pune)
7. చెన్నై(Chennai)
8. కోల్‌కతా(Kolkata)
9. గాంధీనగర్(Gandhi Nagar)
10. జామ్‌నగర్(Jam Nagar)
11. ముంబై(Mumbai)
12. అహ్మదాబాద్(Ahmedabad)
13. చండీగఢ్ (Chandigarh)

IBPS Reasoning Tips: ఐబీపీఎస్ రీజనింగ్ ప్రిపరేషన్.. ఈ టిప్స్ పాటిస్తే బ్యాంక్ జాబ్ మీ జేబులో ఉన్నట్లే..


ఢిల్లీ, ముంబై, పూణే మరియు గురుగ్రామ్ వంటి అనేక నగరాల్లో ప్రైవేట్ కంపెనీలు 5Gని పరీక్షిస్తున్నాయి. అయితే TRAI భోపాల్‌లో మొదటి పరీక్షను నిర్వహించింది. వినియోగదారులకు 5G కనెక్టివిటీని అందించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) ద్వారా నగర మౌలిక సదుపాయాలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవడానికి ఈ పరీక్ష జరుగుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ పోల్స్, స్ట్రీట్ లైట్ పోల్స్, స్మార్ట్ పోల్స్, డైరెక్షన్ బోర్డులు, హోర్డింగ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు సిటీ బస్ షెల్టర్లు వంటి స్ట్రీట్ ఫర్నిచర్ భోపాల్‌లో 5G కోసం మౌలిక సదుపాయాలుగా ఉపయోగించబడ్డాయి.
Published by:Veera Babu
First published:

Tags: 5g mobile, 5g technology, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు