Home /News /technology /

India Mobile Congress 2021: 5Gని త్వరగా విడుదల చేయాలి.. అందుబాటు ధరలోనే సేవలు ఉండాలన్న ముఖేష్ అంబానీ

India Mobile Congress 2021: 5Gని త్వరగా విడుదల చేయాలి.. అందుబాటు ధరలోనే సేవలు ఉండాలన్న ముఖేష్ అంబానీ

5Gని త్వరగా విడుదల చేయాలి.. అందుబాటు ధరలోనే సేవలు ఉండాలన్న ముఖేష్ అంబానీ

5Gని త్వరగా విడుదల చేయాలి.. అందుబాటు ధరలోనే సేవలు ఉండాలన్న ముఖేష్ అంబానీ

డిజిటల్ విప్లవానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి భారతదేశం 5G నెట్‌వర్క్‌పై (5G Network) దృష్టిపెట్టాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. బ్రాడ్‌బ్యాండ్ సెల్యులార్ నెట్‌వర్క్‌ల కోసం 5G లేదా ఫిప్త్ జెనరేషన్ టెక్నాలజీ స్టాండర్డ్‌ను విడుదల చేయాలన్నారు.

ఇంకా చదవండి ...
డిజిటల్ విప్లవానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి భారతదేశం 5G నెట్‌వర్క్‌పై (5G Network) దృష్టిపెట్టాలని తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)  అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani). బ్రాడ్‌బ్యాండ్ సెల్యులార్ నెట్‌వర్క్‌ల కోసం 5G లేదా ఫిప్త్ జెనరేషన్ టెక్నాలజీ స్టాండర్డ్‌ను విడుదల చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశంలా భావించాలని పేర్కొన్నారు. బుధవారం ప్రారంభమైన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్- 2021’ (India Mobile Congress 2021) సదస్సులో మాట్లాడుతూ ఈ అంశాలను నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత్‌ 5G టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. 2016లో రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ప్రారంభించిన అంబానీ.. చౌకైన మొబైల్ డేటా, కనెక్టివిటీలో పరిశ్రమలో విప్లవానికి నాంది పలికిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు 5G రోల్ అవుట్‌పై భారతదేశం దృష్టిపెట్టాలని ఆయన చెబుతున్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో అంబానీ మాట్లాడుతూ, భారతదేశం 2G నుంచి 4G సేవలకు, 4G నుంచి 5Gకి వలసలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. టెక్నాలజీ అన్ని అవసరాలు తీరుస్తున్న ఈ రోజుల్లో.. లక్షలాది మంది భారతీయులను 2G నెట్‌వర్క్‌కు పరిమితం చేయడం అంటే, వారిని డిజిటల్ విప్లవం ప్రయోజనాలకు దూరం చేయడమేనని అభిప్రాయపడ్డారు. 5G నెట్‌వర్క్‌ను అందుబాటు ధరలోనే అందించాల్సిన అవసరం ఉందని ముఖేష్ చెప్పారు.
Mukesh Ambani: ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న ముఖేష్ అంబానీ.. ఆయన ప్రసంగంలో కీలక అంశాలు ఇవే..

‘భారతదేశంలో టెలికాం సేవల ధరలు అందుబాటులో ఉండటంతోనే మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా, అసాధారణంగా పెరిగింది. సేవల విస్తరణలో స్థోమత (affordability) కీలకమైన అంశంగా ఉందనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. భారతదేశంలో ఎక్కువ మందికి డిజిటల్ విప్లవం ప్రయోజనాలు అందాలి. ఇండియా డిజిటల్ ఇంక్లూజన్ వైపు వెళ్లాలి, డిజిటల్ ఎక్స్‌క్లూజన్ వైపు కాదు’ అని తెలిపారు. ఈ సదస్సులో ఫైబర్ కనెక్టివిటీ అంశంపై కూడా అంబానీ మాట్లాడారు.
Mukesh Ambani: డిజిటల్ సమాజానికి భారతదేశం గ్లోబల్ లీడర్‌గా మారుతుంది: ముకేష్ అంబానీ

భారతదేశం ఫైబర్ టెక్నాలజీకి సిద్ధంగా ఉండాలని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా జియో ఫైబర్ నెట్‌వర్క్‌ను ఎంతోమందికి చేరువ చేశామని చెప్పారు. ఫైబర్ కనెక్టివిటీని భారత్‌ అంతటా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందుకు పరిశ్రమ మొత్తం సంయుక్తంగా కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనుంది. ఇది భారతదేశం, దక్షిణాసియాలో నిర్వహించే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరమ్. మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో సాంకేతికతకు సంబంధించిన అంశాలపై టెక్ సంస్థలు దృష్టిసారిస్తాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వంటి ప్రముఖులు సైతం మాట్లాడారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile, Mukesh Ambani, Reliance Industries

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు