5G NETWORK IIT MADRAS A RESOUNDING SUCCESS 5G CALL SUCCESSFULLY TESTED UNION MINISTER TWEETED GH EVK
5G Network: IIT మద్రాస్ అద్భుత విజయం.. 5G కాల్‌ను విజయవంతంగా పరీక్ష.. కేంద్ర మంత్రి ట్వీట్..!
ప్రతీకాత్మక చిత్రం
5G Technology | కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 5G స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. దీంతో ఈ ఏడాది చివరిలోపు దేశంలో 5జీ సాంకేతిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ మద్రాస్‌లో 5G కాలింగ్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం (Central govt) త్వరలోనే 5G స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. దీంతో ఈ ఏడాది చివరిలోపు దేశంలో 5జీ సాంకేతిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోపక్క 5G టెక్నాలజీ (5G Technology) భాగాలు, పరికరాలపై విస్తృతమైన పరీక్షలు చేయనున్నారు. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఐఐటీ మద్రాస్‌లో 5G కాలింగ్‌ను విజయవంతంగా పరీక్షించిన విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘‘ ఆత్మనిర్భర్ 5Gలో భాగంగా IIT మద్రాస్ (IIT Madras) లో 5G కాల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఎండ్-టు-ఎండ్ నెట్‌వర్క్‌లో దీన్ని దేశంలోనే డిజైన్ చేసి అభివృద్ధి చేశారు.’’ అని వైష్ణవ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Google Photos: గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫీచర్ లాంచ్.. ఆల్బమ్స్‌లోని ఫోటోలను డైరెక్ట్‌గా డిలీట్ చేసే ఆప్షన్..
5G కాలింగ్ అనేది, ప్రాథమికంగా 5G నెట్‌వర్క్‌లో 5G స్మార్ట్‌ఫోన్ ద్వారా చేసే సాధారణ ఫోన్ కాల్. వాయిస్ కాలింగ్‌లో అత్యుత్తమ నాణ్యతను పొందేందుకు సర్వీస్ ప్రొవైడర్, పరికరాల తయారీ కోసం తెరవెనుక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. 5G నెట్‌వర్క్ దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత. స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర 5G పరికరాలలో 5G కాలింగ్‌ను ఎనేబుల్ చేయడానికి, 4G (VoLTE) నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను కూడా వినియోగించనున్నారు.
5G వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు
HD వాయిస్+తో వాయిస్ కాలింగ్‌లో మెరుగైన నాణ్యత, అలాగే వీడియో కాల్‌లో సైతం నాణ్యతలో మెరుగుదల, కొత్త వాయిస్, కమ్యూనికేషన్ సేవలు వంటి ప్రయోజనాలు వినియోగదారులు పొందనున్నారు. మరోవైపు సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనాలు కల్పించనున్నారు. ఆదాయం పెరుగుదల కోసం సెల్ టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఇటీవల వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 5G రోల్ అవుట్‌ను ప్రారంభించడానికి అవసరమైన సాంకేతికతను అమలు చేయడానికి దిగ్గజ మొబైల్ కంపెనీలు నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. టెలికాం టాప్ తయారీదారులు మార్చి 2023 నాటికి టాప్ 50 భారతీయ నగరాల్లో 5Gని అమలు చేయడానికి తగినంతగా సన్నద్ధమయ్యారని నివేదిక స్పష్టం చేసింది. అయితే, 5G స్పెక్ట్రమ్ వేలం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తయిన తరువాతనే సాంకేతికత విస్తరణ, 5G రోల్‌అవుట్ ప్రారంభం కానుంది. మరోపక్క జూన్ లేదా జులైలో 5G స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, ఆ తర్వాత టెలికాం ఆపరేటర్లు 5Gని భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి.
కాగా, Airtel, Reliance Jio వంటి అనేక కంపెనీలు ఇప్పటికే దేశంలో తమ 5G సేవలను పరీక్షించడం ప్రారంభించాయి. ఇవి దేశంలో ‘GBps’ విభాగంలో వేగాన్ని చూపుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే, ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో 5G అడుగుపెడుతుంది.
భారతదేశంలో 5G సేవల ధరల గురించి పెద్దగా తెలియనప్పటికీ, ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న 4G ప్లాన్‌ల మాదిరిగానే 5G ప్లాన్‌లకు కూడా ఖర్చవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ ఇటీవల ఒక వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. Airtel 5G ధరలు ప్రస్తుతం అమలులో ఉన్న 4G ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయని చెప్పారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.