హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Launch In India: 4G కంటే 5G ఎంత బెటర్‌? రెండింటి మధ్య ప్రధాన తేడాలు ఏంటో చూడండి..

5G Launch In India: 4G కంటే 5G ఎంత బెటర్‌? రెండింటి మధ్య ప్రధాన తేడాలు ఏంటో చూడండి..

అక్టోబర్ 1న ఢిల్లీలో 5G సేవలకు మోదీ ప్రారంభించారు.  దేశంలో 5G సేవలు లాంచ్ కావడంతో దిగ్గజం టెలికాం సంస్థలు వాటిని యూజర్లకు తీసుకు రావడమే తరువాయిగా మారింది. మొదటిగా ఈ సేవలు హైదరాబాద్‌తో సహా 13 సెలెక్టెడ్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయి.

అక్టోబర్ 1న ఢిల్లీలో 5G సేవలకు మోదీ ప్రారంభించారు. దేశంలో 5G సేవలు లాంచ్ కావడంతో దిగ్గజం టెలికాం సంస్థలు వాటిని యూజర్లకు తీసుకు రావడమే తరువాయిగా మారింది. మొదటిగా ఈ సేవలు హైదరాబాద్‌తో సహా 13 సెలెక్టెడ్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయి.

అక్టోబర్ 1న ఢిల్లీలో 5G సేవలకు మోదీ ప్రారంభించారు. దేశంలో 5G సేవలు లాంచ్ కావడంతో దిగ్గజం టెలికాం సంస్థలు వాటిని యూజర్లకు తీసుకు రావడమే తరువాయిగా మారింది. మొదటిగా ఈ సేవలు హైదరాబాద్‌తో సహా 13 సెలెక్టెడ్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5G సేవలు (5G Internet Service) ఎట్టకేలకు ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో టెలికాం రంగంలో కొత్త శకం ప్రారంభించినట్లు అయ్యింది. అక్టోబర్ 1న ఢిల్లీలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) కార్యక్రమంలో 5G సేవలకు మోదీ శ్రీకారం చుట్టారు. దేశంలో 5G సేవలు లాంచ్ కావడంతో దిగ్గజం టెలికాం సంస్థలు వాటిని యూజర్లకు తీసుకు రావడమే తరువాయిగా మారింది. మొదటిగా ఈ సేవలు హైదరాబాద్‌తో సహా 13 సెలెక్టెడ్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో 5G ఇంటర్నెట్ సర్వీస్ 4Gకి ఎంత భిన్నంగా ఉంటుంది? స్పీడ్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఇది 4G కంటే బెటరేనా? ఇప్పుడు తెలుసుకుందాం.

Iron Man-Style Jet Suit: ప్రత్యేక జెట్ సూట్ తయారు చేసిన బ్రిటన్ కంపెనీ.. డబ్బుంటే ఐరన్ మ్యాన్‌ అయిపోవచ్చు..

* 5G, 4G ఏ స్పీడ్‌లను పొందవచ్చు?

5G నెట్‌వర్క్ 4G కంటే చాలా ఫాస్ట్ ఇంటర్నెట్‌ను అందజేస్తుంది. 5G నెట్‌వర్క్‌తో 5ms కంటే తక్కువ లేటెన్సీతో 20Gbps స్పీడ్ పొందొచ్చు. 4G నెట్‌వర్క్‌లో కేవలం Mbps లలో మాత్రమే ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.

* 5G, 4G నెట్‌వర్క్స్‌ మధ్య తేడా ఏంటి

4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చి పదేళ్లకు పైగానే గడుస్తోంది. ఈ టెక్నాలజీ 3G నెట్‌వర్క్‌ల కంటే ఫాస్ట్ డేటాను అందిస్తోంది. 4G నెట్‌వర్క్‌ ఒకే ప్యాకెట్ల నుంచి డేటా, వాయిస్‌ని ఉపయోగించగల సామర్థ్యాన్ని ఆఫర్ చేసింది. ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చాక డేటా ధరలు కూడా తగ్గాయి. ఫ్రీ వాయిస్ కాల్స్‌ సైతం అందుబాటులోకి వచ్చాయి. మెరుగైన వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) సేవలు, హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 5G నెట్‌వర్క్‌ 4G కంటే పది రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుంది.

వర్చువల్ రియాలిటీ, అడ్వాన్స్‌డ్‌ IoT అప్లికేషన్లు, లో-లేటెన్సీ, అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను 5G నెట్‌వర్క్‌ అందిస్తుంది. అలానే మెటావర్స్ కూడా ఇండియాలో తీసుకురావడం సాధ్యమవుతుంది. ఈ నెట్‌వర్క్ మెరుగైన రీచ్, తక్కువ పవర్ కన్సమ్‌షన్, రియల్-టైమ్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది.

* 5G, 4G నెట్‌వర్క్స్‌లో ఏది బెటర్ ?

పై విషయాలను గమనిస్తే 4G కంటే 5G నెట్‌వర్క్ నిస్సందేహంగా మెరుగైనదని చెప్పచ్చు. లో లేటెన్సీ, ఫాస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్, స్థిరమైన నెట్‌వర్క్‌ను 5G అందిస్తుంది. కనెక్టివిటీ స్టాండర్డ్ పూర్తిగా మారిపోతుంది. అన్ని రంగాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అన్ని పనులను మరింత సులభతరం చేసే సరికొత్త అప్లికేషన్లు కూడా లాంచ్ అవుతాయి. 4G తో పోలిస్తే 5G సాయంతో వైద్య, విద్యా రంగాల్లో కూడా మెరుగైన సేవలు పొందడం సాధ్యమవుతుంది.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

* 5G సిమ్ కార్డుకు అప్‌గ్రేడ్ కావాలా

4G సిమ్ ఉంటే 5G సిమ్‌కు అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రకటించింది. జియో దీనిపై స్పందించాల్సి ఉంది. ఈ సేవలను యాక్సెస్ చేసేందుకు 5G ఫోన్ కొనుగోలు చేయడం తప్పనిసరి.

Published by:Veera Babu
First published:

Tags: 4G, 5g mobile, 5g service, 5G Smartphone, Best 5g mobile, Jio 5G

ఉత్తమ కథలు