హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Rise of Indian Telecom: ల్యాండ్‌లైన్ నుంచి నేటి 5జీ వరకు... భారత టెలికాం రంగం పరిణామ క్రమం ఇదే

Rise of Indian Telecom: ల్యాండ్‌లైన్ నుంచి నేటి 5జీ వరకు... భారత టెలికాం రంగం పరిణామ క్రమం ఇదే

Rise of Indian Telecom: ల్యాండ్‌లైన్ నుంచి నేటి 5జీ వరకు... భారత టెలికాం రంగం పరిణామ క్రమం ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Rise of Indian Telecom: ల్యాండ్‌లైన్ నుంచి నేటి 5జీ వరకు... భారత టెలికాం రంగం పరిణామ క్రమం ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Rise of Indian Telecom | ఒకప్పుడు ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటమే గొప్ప. ల్యాండ్‌లైన్ ఫోన్‌ను లగ్జరీగా భావించేవారు. కానీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఇంటింటికీ మొబైల్ సేవలు లభిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇండియాలో టెలికాం సేవలు ఒకప్పుడు స్టేటస్‌ సింబల్‌గా ఉండేవి. ఇప్పుడు 5జీ సేవలు అందించే స్థాయికి దేశం చేరుకుంది. ఎన్నో దశలను దాటుకుని భారతీయ టెలికాం రంగం ప్రస్తుత స్థితికి చేరుకుంది. 5జీ టెలికాం సేవలను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. దీంతో దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రాగా, వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా లభిస్తాయి. 5జీ సేవలు దేశ టెలికాం విప్లవంలో కీలక మైలురాయిగా నిలిచిపోనున్నాయి. దేశంలో టెలికాం సేవల పరిణామక్రమాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆర్థిక రంగం బలోపేతం

అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు సపోర్ట్ చేసే ఈ 5జీ నెట్‌వర్క్ కారణంగా టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి 450 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి కొత్త రూల్

1981లో టెలిఫోన్ స్టేటస్ సింబల్‌గా...

భారత టెలికామ్ మార్కెట్‌ను సరళీకృతం చేయడానికి 1981లో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతకు ముందు ప్రభుత్వ ఏజెన్సీలే టెలికామ్ వ్యవస్థను నడుపుతుండేవి. అప్పట్లో టెలిఫోన్‌ను సాధారణంగా వినియోగించే వస్తువుగా కాకుండా ఒక విలాసవంతమైన స్టేటస్ సిబల్‌గా చూసేవారు.

ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందంపై వెనకడుగు

ఇందిరా గాంధీ హయాంలో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో టెలిఫోన్ లైన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ITI)ను విలీనం చేయడానికి ఫ్రెంచ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ‘ఆల్కాటెల్ CIT’తో ఒప్పందం జరిగింది. అయితే దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

1985లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏర్పాటు

దేశంలో టెలికాం సేవలను ఆపరేట్ చేసేందుకు 1985లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్థాపించారు. మరుసటి సంవత్సరం మరో రెండు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేశారు. ఒకటి మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL). ఇది మెట్రో ప్రాంతాల్లో టెలికాం సేవలను ఆపరేట్ చేస్తుంది. మరొకటి విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL), ఇది అంతర్జాతీయ టెలికాం సేవలను మేనేజ్ చేయడం కోసం ఏర్పాటు చేశారు.

WhatsApp Call links: వాట్సప్‌లో కాల్ లింక్స్ ఫీచర్... మీరూ ఇలా వాడుకోండి

1991లో సరళీకరణ పాలసీలో భాగంగా టెలికాం రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. అప్పటికే దేశంలో టెలిఫోన్ లైన్ల సంఖ్య 2.15 మిలియన్లకు చేరుకుంది. 1994 తరువాత కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెలికమ్యూనికేషన్స్ పాలసీ (NTP)ని ప్రవేశపెట్టింది. దీంతో టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించింది.

1997లో ట్రాయ్ ఏర్పాటు

దేశంలో టెలికాం సేవలను మరింత విస్తృతం చేయడానికి 1997లో టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను ఏర్పాటు చేశారు. 1999లో కొత్త టెలికాం పాలసీని అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం ప్రకటించింది. సర్కిల్‌కు మల్టిపుల్‌ ఆపరేటర్‌లను అనుమతించడం, లైసెన్సింగ్ ఫీజు విధానాన్ని తీసుకురావడం, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఇంటర్‌కనెక్ట్‌ను అనుమతించడం వంటివి ప్రారంభమయ్యాయి.

టెలికాం వివాదాల పరిష్కారం కోసం 2000లో అప్పీలేట్ ట్రిబ్యునల్ (TDSAT)ను ఏర్పాటు చేశారు. దీంతో టెలికాం రంగంలోకి ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రైవేట్‌ కంపెనీలకు అనుమతి లభించింది. కొన్నేళ్లకు DoT‌ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)గా మార్చారు.

Online Shopping: ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే

‘ఒక దేశం-ఒకే లైసెన్స్’ అనే ఆలోచనతో ప్రవేశపెట్టిన NTP 2012 ద్వారా ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించిన విధానాలు, లక్ష్యాలను మరోసారి పునరుద్ధరించింది. కంపెనీలకు స్పెక్ట్రమ్ లభ్యతను పెంచడంతో పాటు మార్కెట్ ఆధారిత పద్ధతుల ద్వారా పారదర్శకంగా కేటాయింపు చేయడం ఈ పాలసీ లక్ష్యం.

2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్ సేవలు

నేషనల్ టెలికాం పాలసీ-212 కారణంగా దేశంలో మొబైల్ టెలిఫోన్‌లు 2G సెల్యులార్ నెట్‌వర్క్‌తో ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఇది 3G నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందింది. 2G నెట్‌వర్క్ ఫోన్ కాల్స్, సందేశాలను ఎనేబుల్ చేస్తే, 3G నెట్‌వర్క్ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ డేటా కనెక్టివిటీని ప్రారంభించింది. ఆ తరువాత మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్‌తో పాటు ఫోన్ కాల్స్, మెసేజ్ చేసుకునే అవకాశం కల్పించారు.

2012లో, ఎయిర్‌టెల్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 4G సేవలను ప్రారంభించింది. 4Gతో డేటా వేగం మరింత పెరిగింది. తాజాగా 5జీ నెట్‌వర్క్ దేశంలోకి ఎంటర్‌ అయింది. 5జీ నెట్ వర్క్ కారణంగా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, 5g technology

ఉత్తమ కథలు