TV Offers | మీరు కొత్త టీవీ (TV) కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడా 55 అంగుళాల స్మార్ట్ టీవీ (Smart TV) అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీకు అదిరే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ. 17 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
వన్‌ప్లస్ స్మార్ట్ టీవీపై గొప్ప తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ. 17 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. యూ1ఎస్ సిరీస్‌లోని 55 అంగుళాల టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 59,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 17 వేల డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. అంటే రూ. 42,999కు కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా మరో రూ. 2 వేలు అదనపు తగ్గింపు కూడా ఉంది. అయితే ఈ అదనపు తగ్గింపు రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది.
అమెజాన్ పే బ్యాలెన్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఎలా? ఇలా చేయండి!
ఈ వన్‌ప్లస్ టీవీలో 55 అంగుళాల 4కే డిస్‌ప్లే ఉంటుంది. గామా ఇంజిన్, ఎంఈఎంసీ, డైనమిక్ కాంట్రస్ట్, కలర్ స్పేస్ మ్యాపింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ టీవీలో హెచ్‌డీఆర్ 10 ప్లస్, హెచ్ఎల్జీ, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలను కూడా గమనించొచ్చు. ఈ టీవీలో ఇంకా 30 వాట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. డాల్బే ఆడియో సపోర్ట్ ఉంటుంది.
ఒక్కసారి చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు వెళ్లే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
ఇంకా ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ వంటి వంటి ఫీచర్లు ఉన్నాయి. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ , స్పోటిఫై, గూగుల్ ప్లేస్టోర్ వంటి యాప్స్ పని చేస్తాయి. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, బ్లూటూత్ 5.0 వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మీరు కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ తగ్గింపు ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.
ఇకపోతే స్మార్ట్ టీవీ కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంటికి తగినట్లుగా టీవీ సెలెక్షన్ ఉండాలి. చిన్న ఇంట్లో పెద్ద టీవీ సరిపోకపోవచ్చు. అందుకే టీవీ కొనేందుకు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. అలాగే బడ్జెట్ కూడా చూసుకోవాలి. స్మార్ట్ టీవీనా? లేదంటే మామూలు ఎల్ఈడీ టీవీనా అని బేరీజు వేసుకోవాలి. ఇంట్లో నెట్ ఫెసిలిటీ లేకపోతే స్మార్ట్ టీవీ అనవసరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Latest offers, Offers, Smart TV