Home /News /technology /

50 MILLION PEOPLE WILL OBSERVE GADGET FREE HOUR ON WORLD CHILDRENS DAY NS GH

#GadgetFreeHour: నేడు ప్రపంచ బాలల దినోత్సవం.. గాడ్జెట్​ ఫ్రీ అవర్​ క్యాంపెయిన్​లో పాల్గొననున్న 5 కోట్ల మంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆధునిక పరికరాలు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక తల్లిదండ్రులు పిల్లలతో గడపటం తగ్గిపోయింది. దీంతో తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగైపోతున్నాయి. బాలల సంక్షేమం మెరుగుపరచడం కోసం పేరెంట్ సర్కిల్ మ్యాగజైన్ నడుబిగించింది.

ఇంకా చదవండి ...
ఆధునిక పరికరాలు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక తల్లిదండ్రులు పిల్లలతో గడపటం తగ్గిపోయింది. దీంతో తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగైపోతున్నాయి. బాలల సంక్షేమం మెరుగుపరచడం కోసం పేరెంట్ సర్కిల్ మ్యాగజైన్ నడుబిగించింది. ఇవాళ ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా సుమారు 5 కోట్ల మంది గంట పాటు గ్యాడ్జెట్లను దూరంగా పెట్టి, తల్లిదండ్రులు వారి పిల్లలతో గడపాలనే ఉద్దేశ్యంతో #గ్యాడ్జెట్ ఫ్రీ అవర్ పేరుతో ( #GadgetFreeHour) క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న పేరెంట్ సర్కిల్ మేగజైన్ ( Parent Circle Magazine) తెలిపింది. నవంబరు 20న ప్రపంచ బాలల దినోత్సవం రోజు ( World Childrens Day )న గ్యాడ్జెట్ ఫ్రీ అవర్ ( #GadgetFreeHour) క్యాంపెయిన్లో భారీ సంఖ్యలో తల్లిదండ్రులు వారి గ్యాడ్జెట్లను గంటపాటు నిలిపి చేయాలని భావిస్తున్నారని పేరెంట్ సర్కిల్ వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని 2019లో మొదటిసారి ప్రారంభించారు.  అప్పట్లో పది లక్షల కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు, 41,635 పాఠశాలలు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశాయని పత్రిక తెలిపింది.

ఈ ఏడాది ఇప్పటికే సోషల్ మీడియాలో కోటికిపైగా ఇంప్రెషన్స్‌తో ప్రచారం ఊపందుకుందని పేరెంట్ సర్కిల్ ప్రకటించింది. ‘‘ఈ సంవత్సరం, నవంబరు 20న గ్యాడ్జెట్ ఫ్రీ అవర్ ( #GadgetFreeHour) క్యాంపెయిన్ జరుగుతోంది, ఈ కార్యక్రమంలో 5 కోట్ల కన్నా ఎక్కువ మంది పాల్గొనే అవకాశముందని’’ పేరెంట్ సర్కిల్ తెలిపింది. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ‘‘ అంతర్జాతీయ ఐక్యత, పిల్లల్లో అవగాహన పెంచడం, బాలల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి’’ ఈ క్యాంపెయిన్ చేపట్టారు. ఇవాళ సాయంత్రం గం. 7.30 నుంచి 8.30 మధ్య నిర్వహిస్తోన్న గ్యాడ్జెట్ ఫ్రీ అవర్ ( #GadgetFreeHour)లో తల్లిదండ్రులు గ్యాడ్జెట్లను ఆపివేసి పిల్లలతో గడపాలని పేరెంట్ సర్కిల్ మేగజైన్ పిలుపునిచ్చింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్​లో కొత్త ఫీచర్.. ఫీడ్ పోస్ట్​లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఛాన్స్.. వివరాలివే

సాయంత్రం 7.30 నుంచి 8.30 వరకు..
ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్, కుతబ్ మినార్ సహా పలు చారిత్రాత్మక కట్టడాలు, పార్లమెంటు భవనాలు నీలిరంగు లైట్లతో వెలిపోనున్నాయి. బాలల హక్కులు, కోవిడ్ మహమ్మారి బాలల జీవితాలపై చూపిన ప్రభావాన్ని హైలైట్ చేయడానికి యూనిసెఫ్ #గోబ్లూ ( #GoBlue) ప్రచారంలో నీలి రంగు లైట్లు వెలిగించాలని సూచించింది. ఈ ఏడాది ప్రపంచ బాలల దినోత్సవాన్ని ‘ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తు’ ( A better future for every child) అనే థీమ్ తో జరుపుకుంటున్నారు.
Wi-Fi Router: ఇంటర్ నెట్ స్పీడ్ పెరగాలంటే.. వైఫై రూటర్‌ను మీ ఇంట్లోని ఆ ప్లేస్ లో ఉంచండి..

నవంబరు 20వ తేదీని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.  బాలలు వారి భావాలను వ్యక్తం చేయడం, పరస్పర అవగాహన పెంచుకోవడం, సమాచారం పంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. బాలల దినోత్సవాన్నినవంబరు 20న జరుపుకోవాలని1959లో ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన బిల్లును 191 దేశాలు ఆమోదించాయి. దీంతో ఏటా నవంబరు 20న ప్రపంచ బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Childrens day, Gadget

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు