ఈ కరోనా (Corona) మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం (Work From Home) విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. అనేక కంపెనీలు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలను నిర్వహించి నూతన నియామకాలను చేపడుతున్నారు. విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసుల (Online Classes) ద్వారానే క్లాసులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక యూనివర్సిటీలు ఆన్లైన్ విధానంలో పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. వైవా కూడ ఆన్లైన్లోనే సాగుతోంది. వివిద సదస్సులు, మీటింగ్ లు, చివరికి ప్రెస్ మీట్లు కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వివిధ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులతో వివిధ వీడియో కాన్ఫరెర్స్ సాఫ్ట్ వేర్ ల సహాయంతో మీటింగ్ లు నిర్వర్తిస్తూ కో ఆర్డినేట్ చేస్తున్నాయి. ఇందు కోసం Zoom, Google Meet, Microsoft Teams ను నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ మీటింగ్ లు జరిగే కొద్ది సేపు తాము ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని, అందంగా కనిపించాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలి.
Lighting:సాధారణంగా వీడియో కాల్స్ లో లైట్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. లైట్ సరిగా లేకపోతే మనం ఎదుటి వారికి సరిగా కనిపించం. మీరు వర్క్ చేసే గదుల్లో మంచి లైటింగ్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. లైట్ కి ఎదురుగా మీ మొహం ఉండేలా కూర్చొంటే వీడియో కాన్ఫరెన్స్ లో మీ మొహం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముఖ కవలికలు వారికి సులువుగా అర్థం అవుతాయి. ఎల్ఈడీ దీపాలు వాడడం మంచిది. మీరు కంటి అద్దాలు వాడితే కంప్యూటర్ బ్రైట్ నెట్ తగ్గించుకోవాలి. IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు
Camera Quality:మీరు అందంగా కనిపించాలంటే ముఖ్యంగా కెమెరా క్యాలిటీ ముఖ్యం. అయితే.. అందరూ మంచి క్యాలిటీ ఉండే కెమెరా కలిగిన ల్యాప్ టాప్ లు వాడలేదు. అయితే, ఆ వీడియో కాలింగ్ యాప్ లలోని కంట్రోల్స్ సెట్టింగ్స్ ద్వారా క్వాలిటీని కొంత మేర అడ్జస్ట్ చేసుకోవచ్చు.
Audio:మీరు వీడియో కాలింగ్ యాప్ ద్వారా మాట్లాడినప్పుడు ఆడియో క్వాలిటీ కూడా సరిగా ఉండడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో హెడ్ ఫోన్స్ వినియోగించడం చాలా ముఖ్యం.
Internet Quality:వీడియో కాలింగ్ యాప్ లలో మీరు మంచిగా కనిపించాలన్నా.. మీ ఆడియో సరిగా వినిపించాలన్నా ఇంటర్ నెట్ క్వాలిటీ చాల ముఖ్యం. లేకపోతే అంతరాయం ఏర్పడుతుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.