ఈ ఏడాది జూన్ నెల అంటే ఈ నెలలో కూడా అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు (Smartphone) ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో 5 ఫోన్లు (Smartphones) లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ 10ఆర్ లైట్
వన్‌ప్లస్ ఈ నెలలోనే వన్‌ప్లస్ 10ఆర్ లైట్ 5జీ (OnePlus 10R Lite 5G)ని ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇదే ఫోన్ చైనాలో కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100-మ్యాక్స్ ప్రాసెసర్, 8జీబీ /12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ అందించారు. దీని ధర దాదాపు రూ.23,000 ఉంటుందని అంచనా.
వివో టీ2ఎక్స్
వివో టీ2ఎక్స్ (Vivo T2x) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో జూన్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్ అందించారు. కెమెరాల విషయానికొస్తే.... టీ2ఎక్స్‌లో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను వాటర్‌డ్రాప్ కటౌట్‌లో అందించారు. ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర దాదాపు రూ.20,000 ఉండవచ్చని అంచనా.
రియల్‌మీ జీటీ నియో 3టీ
రియల్‌మీ జీటీ నియో 3టీ (realme GT Neo 3T) జూన్ 7న భారతదేశంలో రిలీజ్ అవ్వచ్చు. రియల్‌మీ జీటీ నియో 3టీలో 6.62-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీటీ నియో 3టీ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో రన్ అవుతుంది. వెనుక వైపు 64 ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో షూటర్ అందించారు. ముందు భాగంలో ఫోన్‌లో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.29,999గా ఉండవచ్చు.
రెడ్‌మీ 11 5జీ
రెడ్‌మీ నుంచి రెడ్‌మీ 11 5జీ ఇండియాలో జూన్ నెలలో రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఫోన్‌లో ఏ50 ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.14,000గా ఉండే అవకాశం ఉంది.
* ఒప్పో రెనో 8 లైట్ 5జీ
ఒప్పో రెనో 8 లైట్ 5జీ (Oppo Reno 8 Lite 5G) ఇప్పటికే స్పెయిన్‌లో లాంచ్ అయ్యింది. జూన్ నెలలో ఇండియాలో లాంచ్ కానుంది. ఇందులో 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఆప్షన్ అందించారు. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, రెండు 2ఎంపీ కెమెరాలు ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ ధర దాదాపు రూ.25,000 ఉండే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Smartphones