హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Instagram: త్వరలోనే ఇన్​స్టాగ్రామ్​లో 5 కొత్త ఫీచర్లు.. ఏ ఫీచర్​ ఎలా పనిచేస్తుందంటే?

Instagram: త్వరలోనే ఇన్​స్టాగ్రామ్​లో 5 కొత్త ఫీచర్లు.. ఏ ఫీచర్​ ఎలా పనిచేస్తుందంటే?

ఇన్​స్టాగ్రామ్​ మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఏడాది కొన్ని కొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. ఈ యూజర్​ ఫ్రెండ్లీ ఫీచర్ల ద్వారా వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. ఈ సంవత్సరం ఇన్​స్టాగ్రామ్​ ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఇన్​స్టాగ్రామ్​ మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఏడాది కొన్ని కొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. ఈ యూజర్​ ఫ్రెండ్లీ ఫీచర్ల ద్వారా వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. ఈ సంవత్సరం ఇన్​స్టాగ్రామ్​ ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఇన్​స్టాగ్రామ్​ మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఏడాది కొన్ని కొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. ఈ యూజర్​ ఫ్రెండ్లీ ఫీచర్ల ద్వారా వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. ఈ సంవత్సరం ఇన్​స్టాగ్రామ్​ ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఇంకా చదవండి ...

  మెటా (గతంలో ఫేస్​బుక్​) యాజమాన్యంలోని సోషల్​ మీడియా(Social Media)ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్​కు(Instagram) ఉన్ప పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే టాప్ సోషల్​ మీడియా యాప్​గా(App) దూసుకుపోతుంది. యువత అభిరుచులకు తగ్గట్లు కొత్త ఫీచర్లు పరిచయం చేస్తుండటమే ఇంతటి పాపులారిటీకి ప్రధాన కారణం. ఇన్​స్టాగ్రామ్​ మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు ఈ ఏడాది కొన్ని కొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. ఈ యూజర్​ ఫ్రెండ్లీ ఫీచర్ల ద్వారా వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. ఈ సంవత్సరం ఇన్​స్టాగ్రామ్​ ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

  Gold Cube: వామ్మో.. పార్క్ లో ప్రత్యక్షమైన 186 కిలోల గోల్డ్ క్యూబ్.. ఎక్కడ నుంచి వచ్చిందంటే..


  క్రోనాలాజికల్ ఆర్డర్ ఫీడ్..

  ఇన్‌స్టాగ్రామ్ అతి త్వరలోనే క్రోనాలాజికల్​ ఆర్డర్​ ఫీడ్​ అనే ఫీచర్​ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్​ ద్వారా యూజర్లు తమ ఫీడ్​ల చూపే మూడు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. హోమ్, లైక్, ఫాలో అనే మూడు సార్టింగ్ ఆప్షన్ల ద్వారా ఫీడ్​ షేర్​ చేయవచ్చు. హోమ్​ ఫీడ్​లో యూజర్ల ఇష్టాలు, ప్రవర్తనకు అనుగుణంగా రిలేటెడ్​ పోస్ట్‌లు కనిపిస్తాయి. ఈ ఫీచర్​ కోసం ఆర్టిఫిషియల్​ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. ఇక, లైక్​ ఆప్షన్​ ద్వారా మీరు లైక్​ చేసిన లేదా "ఇష్టమైన" ఖాతాలకు చెందిన పోస్ట్​లు మాత్రమే ఫీడ్​లో కనిపిస్తాయి. చివరగా, ఫాలో ఆప్షన్​ ద్వారా మీరు ఇన్​స్టాగ్రామ్​లో ఫాలో అవుతున్న వారి పోస్ట్​లు మాత్రమే ఫీడ్​లో కనిపిస్తాయి.

  ఫీడ్‌లో పోస్ట్‌లను క్రమాన్ని మార్చడం..

  ఫీడ్​లో పోస్ట్​ల క్రమాన్ని మార్చే ఫీచర్​పై కూడా ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తోంది. ఇది యూజర్లు వారి ప్రొఫైల్ గ్రిడ్‌ని సవరించడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ పోస్ట్‌ల క్రమాన్ని మార్చుకోవచ్చు. రివర్స్ ఇంజనీర్ అలెశాండ్రో పలుజ్జీ గత నెలలోనే ట్విట్టర్‌లో ఈ ఫీచర్​ను పోస్ట్​ చేశారు. ఫీచర్​కు సంబంధించిన రెండు స్క్రీన్‌షాట్లను పంచుకున్నారు. మొదటి స్క్రీన్‌షాట్ “ఎడిట్​ ప్రొఫైల్” పేజీలోని ప్రొఫైల్ సమాచార విభాగాన్ని చూపిస్తుంది. ఇక, రెండో స్క్రీన్​షాట్ “ఎడిట్​ గ్రిడ్‌” ఆప్షన్​ను చూపిస్తుంది.

  స్టోరీస్​ కోసం 3D అవతార్‌..

  స్టోరీస్​, డైరెక్ట్ మెసేజ్​ల కోసం 3D అవతార్‌లను పరిచయం చేసింది ఇన్​స్టాగ్రామ్​. ఫేస్​బుక్​, మెసెంజర్​లో ఇప్పటికే ఉన్న అవతార్‌ ఫీచర్​ను ఇన్​స్టాగ్రామ్​ సైతం తీసుకురానుంది. కొత్త అవతార్లు ఇప్పటికే యూఎస్​, కెనడా, మెక్సికోలోని యూజర్లకు అందుబాటులో వచ్చాయి. ఇవి మెటా ప్లాట్‌ఫారమ్‌లు, స్టిక్కర్లు, ఫీడ్ పోస్ట్‌లు, ఫేస్​బుక్​ ప్రొఫైల్ పిక్చర్లు మరిన్నింటిలో వ్యక్తుల రూపంగా కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోని కొత్త 3డి అవతార్‌లో కొత్త ముఖ ఆకారాలు, ఇంప్లాంట్లు, వినికిడి పరికరాలు, వీల్‌చైర్లు, వైకల్యాలున్న యూజర్లకు అవసరమయ్యే సహాయక పరికరాలు ఉంటాయి,

  ఫాలోవర్స్​కు పెయిడ్​ సబ్‌స్క్రిప్షన్లు..

  -ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు త్వరలోనే ఫాలోవర్స్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​ ఫీచర్​ అందుబాటులోకి రానుంది. అమెరికాలో తొలిసారిగా లాంచ్ కానున్న ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉంది. ప్రస్తుతం, కేవలం 10 మంది కంటెంట్​ క్రియేటర్లపై మాత్రమే ఈ ఫీచర్​ను పరీక్షిస్తోంది. దీన్ని తొలుత బాస్కెట్‌బాల్ ప్లేయర్, ఒలింపియన్, జ్యోతిష్కుడు వంటి కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

  CDAC Recruitment 2022: సీడ్యాక్ లో బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

  ప్రొఫైల్ ఎంబెడ్స్​..

  కొత్త ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎంబెడ్ ఫీచర్‌ను త్వరలోనే తీసుకొస్తామని ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మోస్సేరి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పోస్ట్‌లు, వీడియోలను పొందుపరిచే సామర్థ్యం ఉంటుంది. ఈ ఫీచర్ మీ ప్రొఫైల్‌లోకి స్నీక్-పీక్ పొందడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ ఫీచర్​ అందుబాటులో ఉంది. థర్డ్-పార్టీ వెబ్‌సైట్లలో తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలను హైలైట్ చేయడానికి కంటెట్​ క్రియేటర్లకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్​ ద్వారా వారి బ్రాండింగ్​, బిజినెస్​ను పెంపొందించుకోవచ్చు.

  First published:

  Tags: Instagram, New feature

  ఉత్తమ కథలు