Realme 5: కెమెరాలు 4, బ్యాటరీ 5,000 ఎంఏహెచ్... ధర రూ.10 వేల లోపే

Realme 5 Series | రియల్‌మీ 5 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రియల్‌మీ 5 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ 5 ప్రో రిలీజ్ చేసే అవకాశముంది.

news18-telugu
Updated: August 16, 2019, 2:13 PM IST
Realme 5: కెమెరాలు 4, బ్యాటరీ 5,000 ఎంఏహెచ్... ధర రూ.10 వేల లోపే
Realme 5: కెమెరాలు 4, బ్యాటరీ 5,000 ఎంఏహెచ్... ధర రూ.10 వేల లోపే
news18-telugu
Updated: August 16, 2019, 2:13 PM IST
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఓ వారం ఆగండి. రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఆగస్ట్ 20న రియల్‌మీ 5 సిరీస్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్స్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ఒక్కో ఫీచర్‌ను అధికారికంగా వెల్లడిస్తోంది రియల్‌మీ. 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో నాలుగు కెమెరాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన రియల్‌మీ మరిన్ని విషయాలు వెల్లడించింది. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఫోన్‌ను ఇండియాలో తొలిసారిగా లాంఛ్ చేస్తున్నామని ట్వీట్ చేసింది రియల్‌మీ. అంతేకాదు రూ.10,000 లోపే నాలుగు కెమెరాలతో ప్రపంచంలోనే తొలిసారి ఇండియాలో ఫోన్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక పవర్‌ఫుల్ క్వాల్కమ్ చిప్‌సెట్ ఉండబోతోందని కంపెనీ ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ ఉండొచ్చని భావిస్తున్నారు.



రియల్‌మీ 5 సిరీస్‌కు సంబంధించి చాలా పుకార్లు ఉన్నాయి. అయితే కంపెనీ మాత్రం అధికారికంగా ఒక్కో విషయాన్ని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఫ్లిప్‌కార్ట్‌లో కనిపిస్తున్నాయి. రియల్‌మీ 5 స్మార్ట్‌ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండబోతోందని కంపెనీ ప్రకటించింది.



రియల్‌మీ 5 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రియల్‌మీ 5 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ 5 ప్రో రిలీజ్ చేసే అవకాశముంది. ఇండియాలో రియల్‌మీ 1, 2, 3 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన కంపెనీ... 4 సిరీస్ వదిలేసి నేరుగా 5 సిరీస్ తీసుకొస్తోంది. చైనాలో 4 అంకెను అన్‌లక్కీ నెంబర్‌గా భావిస్తారు కాబట్టే కంపెనీ 4 సిరీస్ రిలీజ్ చేయట్లేదన్న ప్రచారం ఉంది. ఇక రియల్‌మీ 5 సిరీస్ గురించి ప్రచారంలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇవే.

రియల్‌మీ 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్‌ప్లే: 6.53 అంగుళాలు
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ (క్వాడ్ కెమెరా)
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ధర: రూ.10,000 లోపు

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్... ఎలా ఉందో చూశారా?

Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్

WhatsApp Fingerprint: ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ రిలీజ్ చేసిన వాట్సప్... సెట్టింగ్స్ ఇవే
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...