Amazon Prime Day 2019: 'ప్రైమ్ డే సేల్' ప్రకటించిన అమెజాన్... ఆఫర్లు ఇవే

Amazon Prime Day 2019 Sale | రెండు రోజుల పాటు నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉన్నాయి.

news18-telugu
Updated: June 25, 2019, 5:38 PM IST
Amazon Prime Day 2019: 'ప్రైమ్ డే సేల్' ప్రకటించిన అమెజాన్... ఆఫర్లు ఇవే
Amazon Prime Day 2019: 'ప్రైమ్ డే సేల్' ప్రకటించిన అమెజాన్... ఆఫర్లు ఇవే (image: Amazon)
news18-telugu
Updated: June 25, 2019, 5:38 PM IST
మరోసారి 'ప్రైమ్ డే సేల్' ప్రకటించింది అమెజాన్. జూలై 15, 16 తేదీల్లో 48 గంటల పాటు అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. కేవలం ప్రైమ్ కస్టమర్ల కోసం మాత్రమే అమెజాన్ నిర్వహించే సేల్ ఇది. ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీసులతో గ్యాడ్జెట్స్, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, టీవీలు, మొబైల్ యాక్సెసరీస్, స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయి. అంతేకాదు వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తుల లాంఛింగ్ ఉంటుందని ప్రకటించింది కంపెనీ. ఇప్పటికే ఆఫర్లకు సంబంధించిన సమాచారాన్ని అమెజాన్‌ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో చూడొచ్చు. జూలై 6 నుంచి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పూణెలోని ఎంపిక చేసిన మాల్స్‌లో వర్చువల్ రియాల్టీలో టాప్ బ్రాండ్స్‌కు చెందిన కొత్త ఉత్పత్తుల్ని పరిశీలించే అవకాశం కల్పిస్తోంది అమెజాన్.

Amazon Prime Day 2019: అమెజాన్ ప్రైమ్ డే 2019 సేల్‌లో హైలైట్స్ ఇవే...



రెండు రోజుల పాటు నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన అమెజాన్ ఇకో, అమెజాన్ కిండిల్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌ లాంటివాటిని ఆఫర్‌లో కొనొచ్చు. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నవారికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించినవారికి అన్‌లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. అంతేకాదు... క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు జూలై 1 నుంచే ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్లు పొందొచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో కొత్త కంటెంట్ ప్రైమ్ వీడియోలో కనిపించనుంది.

Technology: మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి

Loading...
ఇవి కూడా చదవండి:

Mi Trimmer: షావోమీ నుంచి కొత్త ప్రొడక్ట్... ట్రిమ్మర్ రిలీజ్ చేసిన కంపెనీ

WhatsApp: మీ వాట్సప్‌ని డార్క్ మోడ్‌లోకి మార్చేయండి ఇలా...

Realme: రియల్‌మీ నుంచి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఫోటో తీస్తే ఇలా ఉంటుంది
First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...