Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు షాక్... 41 కోట్ల ఫోన్ నెంబర్లు లీక్...

Facebook | నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన జీడీఐ ఫౌండేషన్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ సన్యామ్ జైన్ ఈ డేటాబేస్‌ని గుర్తించారు.

news18-telugu
Updated: September 5, 2019, 12:35 PM IST
Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు షాక్... 41 కోట్ల ఫోన్ నెంబర్లు లీక్...
Facebook: ఫేస్‌బుక్ యూజర్లకు షాక్... 41 కోట్ల ఫోన్ నెంబర్లు లీక్... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 5, 2019, 12:35 PM IST
మీరు మీ ఫోన్‌ నెంబర్‌ను ఫేస్‌బుక్‌తో లింక్ చేశారా? మీరు తరచూ మీ ఫోన్ నెంబర్‌తోనే ఫేస్‌బుక్‌లో లాగిన్ అవుతుంటారా? మీరే కాదు... ఫేస్‌బుక్ యూజర్లలో చాలామందికి ఫోన్ నెంబర్లతో లాగిన్ కావడం అలవాటు. ఆ నెంబర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇది ఫేస్‌బుక్ యూజర్లకు అతిపెద్ద షాక్. వందలు, వేలు, లక్షలు కాదు... ఏకంగా 41.9 కోట్ల ఫోన్ నెంబర్లు ఫేస్‌బుక్‌ నుంచి లీక్ అయ్యాయి. ఇవన్నీ ఫేస్‌బుక్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్లే. ఇవి ఓపెన్ ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో ఉన్నాయని తేలింది. ఇందులో 13.3 కోట్లు అమెరికా యూజర్లు, 1.8 కోట్లు యూకే యూజర్లు, 5 కోట్లకు పైగా వియత్నాం యూజర్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయని టెక్ క్రంచ్ కథనం. ఇండియాకు సంబంధించిన లెక్కలు తెలియాల్సి ఉంది. ఫేస్‌బుక్ ఐడీ ద్వారా ఈ ఫోన్ నెంబర్లు లీక్ అయినట్టు తెలుస్తోంది. ఫలితంగా యూజర్లకు స్పామ్ కాల్స్, సిమ్ స్వాపింగ్, సిమ్ జాకింగ్ లాంటి సమస్యలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన జీడీఐ ఫౌండేషన్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ సన్యామ్ జైన్ ఈ డేటాబేస్‌ని గుర్తించారు. దీనిపై ఆరా తీయడంతో ఈ డేటా బేస్‌ను ఆఫ్‌లైన్‌లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఫోన్ నెంబర్లు మాత్రమే కాదు పేరు, జెండర్, లొకేషన్ లాంటి వివరాలు కూడా లీకయ్యాయి. అయితే ఇది పాత డేటా అని, గతంలోనే డిలిట్ చేశామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ డేటా వల్ల ఫేస్‌బుక్ అకౌంట్స్‌కు వచ్చిన ముప్పేమీ లేదని వెల్లడించారు. ఫేస్‌బుక్‌ డేటా లీక్ కావడం కొత్తేమీ కాదు. 8.7 కోట్ల యూజర్ల డేటా స్కామ్ కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్‌బుక్‌కు తలనొప్పులు తెచ్చిన విషయం తెలిసిందే.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Google: షాక్... మీ డేటాను గూగుల్ ఎవరికి ఇస్తుందో తెలుసా?

Infinix Hot 8: ట్రిపుల్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ... ధర రూ.6,999 మాత్రమే
Loading...
Smartphone: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...