హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

TVS Apache: అట్రాక్టివ్​ లుక్​, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్‌ అయిన టీవీఎస్ అపాచీ స్పెషల్​ ఎడిషన్‌.. దీని ధర ఎంతంటే?

TVS Apache: అట్రాక్టివ్​ లుక్​, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్‌ అయిన టీవీఎస్ అపాచీ స్పెషల్​ ఎడిషన్‌.. దీని ధర ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మెటార్​ కంపెనీ సరికొత్త స్పెషల్ ఎడిషన్​ బైక్‌ అపాచీ RTR 160 4V 2023ను లాంచ్‌ చేసింది. ఈ లేటెస్ట్‌ బైక్‌ ధరను రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

TVS Apache  : ఆటోమొబైల్‌ కంపెనీలు.. ట్రెండ్‌కు తగినట్లు లేటెస్ట్‌ ఫీచర్‌లతో బైక్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. లుక్‌తోపాటు, టెక్నాలజీ బేస్డ్‌ ఆప్షన్‌లపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మెటార్​ కంపెనీ సరికొత్త స్పెషల్ ఎడిషన్​ బైక్‌ అపాచీ RTR 160 4V 2023ను లాంచ్‌ చేసింది. ఈ లేటెస్ట్‌ బైక్‌ ధరను రూ.1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్​ డీలర్​షిప్​ సెంటర్లలో ఈ బైక్​ లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్​ గతేడాది చివర్లో వచ్చిన అపాచీ 160 4V బ్లాక్ కలర్ స్పెషల్ ఎడిషన్‌ను పోలి ఉంటుంది. సాధారణ అపాచీ RTR 160 4Vతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్​లో కొన్ని మార్పులు చేశారు.

 మరింత తేలికగా బైక్‌

ఈ లేటెస్ట్‌ బైక్‌ మ్యాటీ బ్లాక్​, పెరల్​ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. డ్యూయల్​ టోన్​ ఈట్​, ఎడ్జస్టబుల్ క్లచ్​, బ్రేక్​ లీవర్స్‌​తో వస్తుంది. కాగా దీనిలో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేయడంతో అదిరిపోయే లుక్‌లో కనిపిస్తుంది. అపాచీ RTR 160 4V 2023 స్పెషల్ ఎడిషన్​లో ‘బుల్‌పప్’ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. దీని ఫలితంగా మొత్తం బరువు ఒక కిలోగ్రాము తగ్గి తేలికగా అనిపిస్తుంది. ఇతర స్పెషల్ ఎడిషన్ మాదిరిగానే ఫ్యూయల్‌ ట్యాంక్, పిలియన్ సీటు, వెనుక అల్లాయ్ వీల్స్‌ను కంపెనీ అందించింది. బుల్‌పప్ ఎగ్జాస్ట్ యూనిట్ బుల్‌పప్ మెషిన్ గన్‌లను పోలి ఉండే అల్లాయ్​ వీల్స్‌ను అమర్చింది.

MBA Admissions: క్యాట్ లేకుండా ఎంబీఏలో అడ్మిషన్స్ పొందొచ్చు..ఇతర టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహిస్తున్న ఎగ్జామ్స్‌ ఇవే?

  అపాచీ RTR 160 4V 2023 ఫీచర్లు

అపాచీ RTR 160 4V 2023 స్పెషల్​ ఎడిషన్‌లో LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్‌లతో స్టాండర్డ్ అండ్​ ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, సింగిల్-ఛానల్ ABS సిస్టమ్, LED హెడ్‌ల్యాంప్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా సిక్స్-స్పోక్ బ్లాక్ ఫ్రంట్ అల్లాయ్ వీల్, LED డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు LCD ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్, రేడియల్ రియర్ టైర్, స్మార్ట్ Xonnect బ్లూటూత్ కంపాటిబులిటీ వంటివి కూడా ఉన్నాయి. అపాచీ RTR 200 4V సైతం అపాచీ RR 310లో తరహాఆ రెయిన్, అర్బన్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లలో పనిచేస్తుంది. ఇంజిన్​ విషయానికి వస్తే.. 2023 TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ 159.7 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్​ 17.63 hp గరిష్ట శక్తిని, 14.73 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని పవర్‌ట్రెయిన్ 5 -స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లింక్​ అయి ఉంటుంది. అపాచీ 160 4V బజాజ్ పల్సర్ N160, హీరో ఎక్స్​ట్రీమ్​ 160R, హోండా హార్నెట్ 2.0 మొదలైన బైక్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Tvs

ఉత్తమ కథలు