దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్‌కు చెందిన పల్సర్ బైక్ లకు దేశంలో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా యువతలో ఈ బైక్ లంటే యమ క్రేజ్ ఉంది. ఇప్పటికే అమ్మకాల్లో మంచి వృద్ధి కనబర్చిన పల్సర్ NS నేకెడ్ స్ట్రీట్ మోడల్స్‌ను అప్‌డేట్ చేసింది. బజాజ్ పల్సర్ NS200, NS160 బైక్‌లను గ్రాఫిక్స్, మల్టిపుల్ సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్స్‌తో లాంచ్ చేసింది. వాటి ధరలు, ఫీచర్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం.
* స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా ఫోర్క్‌లు
బజాజ్ కంపెనీ పల్సర్ NS200, NS160- 2023 మోడల్స్‌లో కంపెనీ డ్యూయల్-ఛానల్ ABSను కొత్తగా జోడించింది. బ్రేకింగ్ సిస్టమ్‌లో 300 mm ఫ్రంట్ డిస్క్, 230 mm రియర్ డిస్క్‌ను అందించింది. ఈ బైక్‌లలో సెగ్మెంట్-ఫస్ట్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా ఉంటాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ రీడౌట్, ఇన్‌స్టంటేనియస్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీతో కూడిన పల్సర్ సిగ్నేచర్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఉంటుంది.
* ఇంజన్ కెపాసిటీ వివరాలు
బజాజ్ పల్సర్ NS200-2023 మోడల్‌లో199.5 cc ట్రిపుల్ స్పార్క్ DTS-i 4V పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 24.3 bhp వద్ద మ్యాక్సిమం పవర్, 18.7 Nm వద్ద మ్యాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. గత మోడల్‌తో పోల్చితే ఇది 1.l5 కిలోల వెయిట్ తక్కువగా ఉండడం వల్ల క్లాస్-లీడింగ్ పవర్-టు-వెయిట్ రేషియోని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇక, బజాజ్ పల్సర్ NS160-2023 మోడల్‌లో 160.3 cc ట్విన్ స్పార్క్ FI DTS-i పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 17 bhp వద్ద మ్యాక్సిమం పవర్, 14.6 Nm వద్ద మ్యాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* ధర, కలర్ ఆప్షన్స్
బజాజ్ పల్సర్ NS200-2023 ధర రూ.1.47 లక్షలు కాగా, బజాజ్ పల్సర్ NS160-2023 ధర రూ.1.35 లక్షలు. ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీకి సంబంధించినవి. ఈ రెండు బైక్‌లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్, ప్యూటర్ గ్రే వంటి నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చాయి.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాల్లో ఈ బైక్‌ల అమ్మకాలు జరుగుతున్నాయి.
బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. దక్షిణ అమెరికా, ఆసియా దేశాల్లో పల్సర్ ఎన్‌ఎస్ సిరీస్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. ‘ఈ సిరీస్‌లో తాజా అప్‌గ్రేడ్ మోడల్స్‌తో కస్టమర్లకు మరింత చేరువకానున్నాం. ఈ బైక్‌లు పనితీరులో మంచి పికప్ పంచ్‌ను కలిగి ఉన్నాయి. ఇవి పల్సర్ విలువను మరింత మెరుగుపరిచే అద్బుతమైన స్ట్రీట్ ఫైటర్స్. కొత్త, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో వచ్చిన ఈ రెండు మోడల్స్ కస్టమర్లను ఆట్టుకుంటాయి.’ అని శర్మ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Auto, Bajaj, Technology