Home /News /technology /

2022 ROYAL ENFIELD HUNTER 350 SPOTTED AT DEALERSHIP LAUNCH IN AUGUST 8 KNOW SPECIFICATIONS VB

Royal Enfield Hunter 350: ఆగస్టు 7న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లాంచ్.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి..

Royal Enfield Hunter 350: ఆగస్టు 7న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లాంచ్.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి..

Royal Enfield Hunter 350: ఆగస్టు 7న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లాంచ్.. బడ్జెట్ ధరలో అందుబాటులోకి..

Royal Enfield Hunter 350: ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లకు ఎనలేని ఆదరణ ఉంటుంది. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. భారతదేశానికి చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ తదుపరి మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350) ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇంకా చదవండి ...
ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లకు(Royal Enfield Bike) ఎనలేని ఆదరణ ఉంటుంది. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. భారతదేశానికి చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ తదుపరి మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350) ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తెలిసిన సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్ ను ఆగస్ట్ 7, 2022వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధర అనేది కూడా ఆ రోజే రివీల్ చేయనున్నారు. అధికారికంగా వినియోగదారుల వద్దకు చేరే ముందే వీటిని మొదట డీలర్ షిప్ లకు పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల ఓ డీలర్ స్టాక్ యార్డులో డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిళ్లు కనిపించాయి.

SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


అంతకముందే ఈ మోటార్ సైకిల్ కు సంబంధించి అనేక విషయాలను లీక్ అయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ పాపులర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ మీటియోర్ 350 ని తయారు చేసిన అదే J ప్లాట్‌ఫారమ్‌పై ఈ కొత్త హంటర్ 350 మోటార్‌సైకిల్ ను నిర్మిస్తోంది. రెండు మోడళ్లలో ఈ బైక్ రానుంది. హంటర్ 350 బైక్ పొడవు 2,055 mm, వెడల్పు 800 mm, ఎత్తు 1,055 mm మరియు దాని వీల్‌బేస్ 1,370 mm. వాహనం బరువు 360 కిలోలుగా ఉండనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కెల్లా పరిమాణంలో అతి చిన్నదిగా ఉంటుంది. హంటర్ 350లో టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్ అండ్ రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. సర్క్యులర్ హెడ్‌ల్యాంప్, స్ట్రాంగ్ ఎగ్జాస్ట్‌తో రెట్రో లుక్‌లతో ఈ బైక్ అందుబాటులోకి రావచ్చు. ఫ్లాట్ హ్యాండిల్ బార్, లో-సీటు హైట్, స్మాల్ టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్ల వల్ల దీనిని హైవేలతో పాటు సిటీ స్ట్రీట్స్‌లో నడపడం మరింత ఈజీ అవుతుంది.



బైక్‌లో సింగిల్ పీస్ సీటు మరియు చిన్న టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఇది కాంపాక్ట్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌తో వస్తుంది . లీకైన సమాచారం ప్రకారం.. దీని ధర కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.30 లక్షల నుండి రూ. 1.40 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇది అధికారికంగా మాత్రం సంస్థ ధ్రవీకరించలేదు. వినియోగదారులకు తక్కువ ఖర్చులో ఈ బైక్ ను అందించేందుకు కంపెనీ తమ ప్రస్తుత మీటియోర్ 350 మరియు క్లాసిక్ 350 మోడళ్లలో ఉపయోగించిన అనేక విడిభాగాలు మరియు పరికరాలను ఈ కొత్త హంటర్ 350 లో కూడా కొనసాగించే అవకాశం ఉంది.

CSB Recruitment 2022: సెంట్రల్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. 


ఇక దీనిలో అంతకు ముందు తయారు చేసిన బైక్ లల్లో ఉండే ఫీచర్స్ కంటే తక్కువ ఫీచర్స్ ఉండటంతో ధర కూడా తగ్గిస్తున్నారని తెలుస్తోంది.  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉపయోగించే సింగిల్-సిలిండర్ ఇంజన్ 349cc మోటార్ 20.2bhp మరియు 27Nm అవుట్‌పుట్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.  హంటర్ 350లో అవుట్‌పుట్ అలాగే ఉండే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Auto mobile, Automobiles, Bikes, E-bikes, Royal Enfield

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు