Home /News /technology /

2021 IN REVIEW THE BEST TWO WHEELER LAUNCHES IN THE PAST YEAR GH VB

2021 In Review: 2021లో విడుదలైన బెస్ట్​ టూవీలర్స్ ఇవే.. కరోనా టైమ్​లోనూ భారీగా అమ్మకాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2020లో కరోనా మహమ్మారి కారణంగా నెమ్మదించిన ఆటోమొబైల్​ పరిశ్రమ ఈ ఏడాది బాగా పుంజుకుంది. దీంతో.. 2021లో అనేక ద్విచక్ర వాహనాలు మార్కెట్​లోకి విడుదలయ్యాయి. పెట్రోల్​తో నడిచే టూవీలర్లతో పాటు ఎలక్ట్రిక్​ టూవీలర్లు సైతం మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. 2021లో మార్కెట్​లోకి వచ్చిన బెస్ట్​ టూవీలర్స్​ గురించి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
2020లో కరోనా మహమ్మారి(Corona Virus) కారణంగా నెమ్మదించిన ఆటోమొబైల్​ పరిశ్రమ ఈ ఏడాది బాగా పుంజుకుంది. దీంతో.. 2021లో అనేక ద్విచక్ర వాహనాలు మార్కెట్​లోకి విడుదలయ్యాయి. పెట్రోల్​తో నడిచే టూవీలర్లతో పాటు ఎలక్ట్రిక్​ టూవీలర్లు(Elecric vehicles) సైతం మార్కెట్​లోకి లాంచ్​ అయ్యాయి. 2021లో మార్కెట్​లోకి వచ్చిన బెస్ట్​ టూవీలర్స్​ గురించి తెలుసుకుందాం.

రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350..
రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) మెటియర్​ 350 ఆధారంగా, క్లాసిక్ 350ని డిజైన్​ చేసింది. అయితే, పాత మోడల్​తో పోలిస్తే దీనిలో అనేక మార్పులు చేసింది. దీనిలో పెద్ద సింగిల్-క్రెడిల్ యూనిట్‌గా ఉండే ఫ్రేమ్ డబుల్ డౌన్‌ట్యూబ్‌, సస్పెన్షన్ లెస్​ 41mm ఫోర్క్ వంటివి చేర్చింది. ఇక, దీనిలోని 349cc సింగిల్ ఇంజిన్​ 20.3hp వద్ద గరిష్ట శక్తి, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Viral Video: పెళ్లి వేడుకలోనే అలా అడిగితే ఎలా బాబూ.. పెళ్లికూతురి రియాక్షన్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..


కేటీఎం ఆర్​సీ..
కేటీఎం ఆర్​సీ సిరీస్​లో ఒకేసారి రెండు బైక్​లు లాంచ్​ అయ్యాయి. ఈ స్పోర్ట్స్​ బైక్​లకు భారత మార్కెట్​లో ఊహించని రెస్పాన్స్​ వచ్చింది. ఆర్​సీ బైక్‌ల డిజైన్​ పరిశీలిస్తే.. కొంచెం ఉబ్బెత్తుగా ఉండే ట్యాంక్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూక్స్‌లో ఉన్నటువంటి హెడ్‌ల్యాంప్ యూనిట్‌ వంటివి చేర్చింది. ప్రస్తుతానికి, కేటీఎఆ ఆర్​సీ సిరీస్​లో ఆర్​సీ 125, ఆర్​సీ 200 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆర్​సీ 390 వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకానుంది.

పల్సర్ 250 ట్విన్స్​..
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటిగా బజాజ్ పల్సర్​ 250 ట్విన్స్​ నిలిచింది. పల్సర్ 250 ట్విన్స్​ ఇంజిన్, డిజైన్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తాయి. బజాజ్ పల్సర్ F250, N250 లను అన్ని కొత్త డిజైన్లతో ఫెయిర్డ్, నేక్డ్ బైక్‌లుగా పరిచయం చేసింది. బజాజ్​ N250 నేక్డ్ దాని అన్ని ఇతర మార్పులతో పాటు రాడికల్ కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌ను అందించింది.

Omicron-Lockdown: ఈ వారంలోనే భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్‌.. త్వరలోనే దేశంలో లాక్ డౌన్..? విశ్లేషణలో ఏం తేలిందంటే..


ఓలా ఎస్​1, ఎస్​1 ప్రో..
ఈ ఏడాది భారత మార్కెట్లోకి వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బుకింగ్స్​లో సంచలనాలు సృష్టించాయి. ఓలా ఈ–స్కూటర్ల రాకతో భారత్​లో ఈవీ మార్కెట్​ గణనీయంగా వృద్ది చెందుతోంది. ఓలా బేస్ వేరియంట్​ రూ. 99,999, ప్రో వేరియంట్‌ రూ. 1,29,999 ధర వద్ద విడుదలయ్యాయి. బజాజ్ చేతక్, ఏథర్ 450 ఎక్స్ వంటి ఖరీదైన స్కూటర్ల కంటే ఓలా ఈ–స్కూటర్లకు మంచి ఆదరణ లభించింది.

హీరో ఎక్స్​పల్స్​ 200..
హీరో సంస్థ ఈ ఏడాది ఎక్స్​పల్స్​ 200 4వీ టూవీలర్​ను లాంచ్​ చేసింది. బీఎస్​6 ప్రమాణాలతో దీన్ని అప్​డేట్​ చేసింది. పాత వేరియంట్​తో పోలిస్తే ఈ బైక్‌లో చిన్న గేరింగ్, పెద్ద ఆయిల్ కూలర్ వంటి అనేక మార్పులు చేసింది.

Marriages: కోవిడ్ కారణంగా మీ పెళ్లి రద్దు అయిందా..? ఆ డిమాండ్లతో అతలాకుతలం అవుతున్న వెడ్డింగ్ ఇండస్ట్రీ..


టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​ 310..
టీవీఎస్​ టూవీలర్​ మార్కెట్​లో వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది అపాచీ ఆర్​ఆర్​ 310, అపాచీ ఆర్​టీఆర్​ 165 అనే రెండు టూవీలర్లను లాంచ్​ చేసింది. వీటితో పాటు టీవీఎస్​ రైడర్ 125, జూపిటర్ 125లను కూడా విడుదల చేసింది. రైడర్ 125 టూవీటర్​ను స్టైలింగ్, సెగ్మెంట్-ఫస్ట్ రైడింగ్ మోడ్‌లతో డిజైన్​ చేసింది.

యమహా ఏరోక్స్ 155..
యమహా స్కూటర్ సెగ్మెంట్‌కు కొత్తేమీ కాదు. ఇప్పటికే యమహా నుంచి అనేక టూవీలర్లు మార్కెట్​లోకి విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏరోక్స్ 155ను స్పోర్టి డిజైన్‌తో లాంచ్​ చేసింది. ఈ స్కూటర్​లో 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్​ను అమర్చింది. ఈ​ ఇంజన్​ను వీవీఏ టెక్నాలజీతో రూపొందించింది. దీనిలోని ICE ఇంజిన్ అత్యధిక మైలేజీ ఇస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Launch app, Royal Enfield, Two wheeler

తదుపరి వార్తలు