Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై... ఇప్పటికే 2.35 కోట్ల యూజర్లు

Free Railway WiFi | కోల్‌కతా, ఢిల్లీ, ముంబై లాంటి టైర్-1 నగరాల్లో ఎక్కువగా యూజర్ లాగిన్స్, డేటా వినియోగం ఎక్కువగా ఉంది. తర్వాతి స్థానంలో టైర్-2 పట్టణాలున్నాయి.

news18-telugu
Updated: June 26, 2019, 4:41 PM IST
Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై... ఇప్పటికే 2.35 కోట్ల యూజర్లు
Free Wifi: రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై... ఇప్పటికే 2.35 కోట్ల యూజర్లు (image: Reuters)
  • Share this:
భారతదేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఇప్పటికే 2.35 కోట్ల మంది యూజర్లు రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై ఉపయోగించుకున్నారని లెక్క తేలింది. ఒక్క హౌరా రైల్వే స్టేషన్‌లోనే నెలకు 4.9 లక్షల యూజర్ లాగిన్స్ రిజిస్టర్ అయ్యాయి. రైల్‌వైర్ ప్రాజెక్ట్‌లో భాగంగా 2019 మే నాటికి 1,606 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే. ఈ ఏడాది చివరినాటికి మరో 4,791 రైల్వే స్టేషన్లకు ఉచిత వైఫై సేవలు అందుతాయని భారతీయ రైల్వేకు చెందిన డిజిటల్ విభాగం రైల్‌టెల్ తెలిపింది.

మొబైల్ ఇంటర్నెట్ ఉన్నతర్వాత కూడా రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవల్ని పొందుతున్నారు రైల్వే ప్రయాణికులు. పబ్లిక్ వైఫైకి డిమాండ్ పెరుగుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏడాది చివరి నాటికి 4,791 స్టేషన్లకు ఉచిత వైఫై సేవల్ని విస్తరిస్తాం. దాంతో హాల్ట్ రైల్వే స్టేషన్లలో తప్ప అన్ని స్టేషన్లలో వైఫై హాట్‌స్పాట్ కనిపిస్తుంది.

రైల్‌టెల్ ప్రకటన


కోల్‌కతా, ఢిల్లీ, ముంబై లాంటి టైర్-1 నగరాల్లో ఎక్కువగా యూజర్ లాగిన్స్, డేటా వినియోగం ఎక్కువగా ఉంది. తర్వాతి స్థానంలో టైర్-2 పట్టణాలున్నాయి. ప్రతీ యూజర్ సగటున 30 నిషాల్లో 343 ఎంబీ డేటా వినియోగించుకుంటున్నట్టు లెక్కలు తేలాయి. 'రైల్ వైర్ వైఫై' ప్రాజెక్ట్‌లో భాగంగా 2016 జనవరిలో ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో తొలిసారిగా ఉచిత వైఫై సేవల్ని మొదలుపెట్టింది భారతీయ రైల్వే. ప్రస్తుతం ఉచిత వైఫై సేవలు 1,606 రైల్వే స్టేషన్లలో అందుతున్నాయి. 'రైల్ వైర్ వైఫై'ని ఉచితంగా ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించుకోవచ్చు.

Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్


ఇవి కూాడా చదవండి:IRCTC Tour: తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ

Indian Railways: రైల్వే ప్రయాణికులకు 'గివ్ ఇట్ అప్' స్కీమ్... ఎందుకో తెలుసా?

Photos: ఎయిర్‌పోర్టు లాంటి హంగులతో రైల్వే స్టేషన్లు
Published by: Santhosh Kumar S
First published: June 26, 2019, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading