హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

1G To 5G Journey: 1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ ఇదే!

1G To 5G Journey: 1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్టార్టప్ కంపెనీలు, ఇండస్ట్రీ వర్గాలు తమ ప్రొడక్ట్స్‌ని దేశంలోనే పరిశీలించేందుకు వీలుగా ప్రధాని నరేంద్ర మోదీ మే 17వ తేదీన మొట్టమొదటి 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

స్టార్టప్ కంపెనీలు, ఇండస్ట్రీ వర్గాలు తమ ప్రొడక్ట్స్‌ని దేశంలోనే పరిశీలించేందుకు వీలుగా ప్రధాని నరేంద్ర మోదీ మే 17వ తేదీన మొట్టమొదటి 5జీ (5G) టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2030 నాటికి భారత్‌లో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఈ క్రమంలో 1జీ నుంచి 5జీ వరకు మొబైల్ టెక్నాలజీ ఎలా మారిందనేది హాట్ టాపిక్‌గా మారింది. గడిచిన నాలుగు దశాబ్దాలలో వైర్‌లెస్ సెల్యులార్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. 40 ఏళ్ల క్రితం వైర్‌లెస్ సెల్యులార్ టెక్నాలజీ ఫస్ట్ జనరేషన్ (1G) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత సెకండ్ జనరేషన్ సెల్యులార్ నెట్‌వర్క్‌గా 2జీ డిజిటల్ కమ్యూనికేషన్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టెలికాం టెక్నాలజీ ప్రతి తరానికి చాలా అడ్వాన్స్‌డ్‌గా మారుతోంది. అయితే త్వరలోనే ఇండియాలో 5జీ లాంచ్ కానున్న నేపథ్యంలో 1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

1జీ నుంచి 2జీ వరకు జర్నీ

జపాన్‌లో 1970ల చివరలో లాంచ్ చేసిన 1జీ వాయిస్ కాల్స్‌ను మాత్రమే అందించింది. 1జీ మొబైల్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫస్ట్ జనరేషన్‌గా పరిచయమయ్యింది. 1జీ తక్కువ సౌండ్ క్వాలిటీ, తక్కువ కవరేజ్, ఎటువంటి రోమింగ్ సపోర్ట్ లేకుండా వచ్చింది. 1991లో 2జీ పరిచయంతో టెలికాం టెక్ పూర్తిగా మారిపోయి. 1జీ అనలాగ్ సిగ్నల్స్ సెకండ్ జనరేషన్‌లో పూర్తిగా డిజిటల్ అయ్యాయి. 2జీ టెక్నాలజీ సీడీఎంఏ (CDMA), జీఎస్ఎం(GSM) కాన్సెప్ట్‌లను పరిచయం చేయడమే కాకుండా, యూజర్లకు రోమ్ ఫెసిలిటీ అందించింది.

Vivo Y75 4G: భారత్‌లో లాంచ్‌ అయిన Vivo Y75.. ధర, స్పెసిఫికేషన్లు ఇలా..!

అలానే ఎస్ఎంఎస్‌లు, గరిష్టంగా 50 kbps వేగంతో ఎంఎంఎస్ వంటి డేటా సేవలను అందించింది. ఆ కాలంలో వాయిస్ కాలింగ్‌పై మాత్రమే ఎక్కువ దృష్టి ఉన్నప్పటికీ డేటా సేవలు కూడా పరిచయం అయ్యాయి. 2జీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో క్రమంగా కనుమరుగవుతోంది కానీ భారత్‌లో ఇప్పటికీ 2జీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులు 2జీ సేవలను ఉపయోగిస్తున్నారు.

3జీ విప్లవం

2001లో 3G సేవలను ప్రవేశపెట్టడంతో మొబైల్ టెక్నాలజీ మరింత మెరుగుపడింది. 3జీ మొబైల్ ఇంటర్నెట్‌కు పూర్తిస్థాయిలో యాక్సెస్‌ను అందించింది. 2జీ కంటే నాలుగు రెట్లు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్‌కు 3జీ సపోర్ట్ చేసింది. అంతేకాదు మొబైల్ ఫోన్‌లకు ఈమెయిల్స్, నావిగేషనల్ మ్యాప్స్‌, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్, మ్యూజిక్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకొచ్చింది.

4జీలో ప్రపంచం

2009 డిసెంబర్ నెలలో బ్రాడ్‌బ్యాండ్ సెల్యులార్ నెట్‌వర్క్ టెక్నాలజీకి చెందిన ఫోర్త్ జనరేషన్ (4G) అందుబాటులోకి వచ్చింది. 4జీ టెక్నాలజీ హై స్పీడ్, హై క్వాలిటీ, హై కెపాసిటీతో వాయిస్, డేటా సర్వీసెస్ ఆఫర్ చేసింది. 4జీ 3జీ కంటే ఐదు నుండి ఏడు రెట్లు వేగవంతమైన స్పీడ్‌తో వచ్చింది. 4జీ నెట్‌వర్క్‌ హైడెఫినిషన్ వీడియో అండ్ గేమింగ్, స్ట్రీమింగ్, లో లేటెన్సీ వంటి అధునాతన ఫీచర్లతో ఇది ఫోన్‌లను చేతిలో పట్టుకుని కంప్యూటర్లుగా మార్చింది.

5జీ ప్రత్యేకతలు

5జీ నెట్‌వర్క్ కస్టమర్‌లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ ఒక మిల్లీసెకన్ లేటెన్సీని అందిస్తుంది. అంటే ఒక మిల్లీసెకనులో ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఇది 4జీ కంటే 50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు. 5జీ ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుందని తేలింది. 5జీ డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఎలక్ట్రానిక్ పరికరాలు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడం సులభతరం అవుతుంది. రిమోట్‌గా ఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరింత మెరుగు పడుతుంది.

భవిష్యత్తులో 5జీ వల్ల స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతుంది. 5జీ దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, కెనడాతో సహా అనేక ప్రదేశాలలో అందుబాటులోకి వచ్చింది.

ఫ్యూచర్ జనరేషన్లు

ప్రస్తుతానికి 6జీ అందుబాటులోకి రాలేదు కానీ ఈ నెట్‌వర్క్‌ 5జీ కంటే మెరుగైన సేవలను అందిస్తుంది. జీరో సున్నా లాగ్‌తో కమ్యూనికేషన్‌ను ఆఫర్ చేసే అవకాశముంది. హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగించి రిమోట్ సర్జరీ, బీమ్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను కూడా సజావుగా నిర్వహించడం సాధ్యమవుతుంది. 6జీ సేవలు 2030లోగా అందుబాటులోకి వచ్చే అవకాశం.

ఇండియా 5జీ టెస్ట్‌బెడ్, 6జీ లక్ష్యం

మంగళవారం, 220 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి 5G టెస్ట్‌బెడ్‌ను మోదీ ప్రారంభించారు. ఈ టెస్ట్‌బెడ్‌ స్టార్టప్‌ కంపెనీలు, ఇండస్ట్రీ ప్లేయర్లు తమ ఉత్పత్తులను స్థానికంగా పరీక్షించడానికి, వాటిని 5జీకి సిద్ధంగా ఉంచడానికి సహాయపడుతుంది.

First published:

Tags: 5G, 5g smart phone, 5g technology

ఉత్తమ కథలు