Home /News /technology /

1988 APPLE SMART WATCH IS SET FOR AUCTION CLICK HERE TO KNOW PRICE AND WATCH DETAILS PRV GH

Apple Smartwatch: వేలానికి 1988 నాటి యాపిల్ స్మార్ట్​వాచ్​.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

పాత స్మార్ట్ వాచ్  (Image credit : ComicConnect)

పాత స్మార్ట్ వాచ్ (Image credit : ComicConnect)

యాపిల్ వాచ్ కంటే ముందు తయారు చేసిన యాపిల్ ప్రేరేపిత స్మార్ట్‌వాచ్ ఉందని మీలో ఎంత మందికి తెలుసు? 1988 సంవత్సరంలో సీకో కంపెనీ యాపిల్ ప్రేరెపిత స్మార్ట్ వాచ్ ను తయారుచేసింది. ప్రస్తుతం ఈ రిస్ట్ మ్యాక్ స్మార్ట్ వాచ్ CominConnect.comలో వేలం వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ (apple) కంపెనీ బ్రాండ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సంస్థ నుంచి ఏదైనా ప్రొడక్ట్ రిలీజ్ అవుతోందంటే ఎగబడి కొనడానికి జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి అంతలా ప్రజల్లోకి యాపిల్ ప్రొడక్ట్స్ దూసుకెళ్లాయి. ఆ సంస్థ నుంచి వచ్చే ఫోన్లు (phones), మ్యాక్, స్మార్ట్ వాచ్ (smartwatches) లకు ప్రపంచ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ లు వాడటం సర్వసాధారణమైపోయింది. మార్కెట్లో ఎన్ని రకాల స్మార్ట్ వాచ్ లు ఉన్నా... యాపిల్ స్మార్ట్ వాచ్ (apple smartwatch) కు ఉన్న క్రేజ్ వేరు. యాపిల్ వాచ్ ను 2015లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే... యాపిల్ వాచ్ (apple smartwatch) కంటే ముందు తయారు చేసిన యాపిల్ ప్రేరేపిత స్మార్ట్‌వాచ్ (Apple-inspired smartwatch) ఉందని మీలో ఎంత మందికి తెలుసు? ..

వ్యోమగాములు ఉపయోగించినట్లు..

1988 సంవత్సరంలో సీకో కంపెనీ యాపిల్ ప్రేరెపిత స్మార్ట్ వాచ్ ను తయారుచేసింది. ప్రస్తుతం ఈ రిస్ట్ మ్యాక్ స్మార్ట్ వాచ్ CominConnect.comలో వేలం వేస్తున్నారు. ఈ ఓల్డ్ యాపిల్ వాచ్$25,000 అంటే ఇండియన్ కరెన్సీలో (సుమారు రూ. 18,62,400) నుంచి $50,000 (సుమారు రూ. 37,24,900) వరకు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. సీకో కంపెనీ రిలీజ్ చేసిన ఈ వాచ్ ను అట్లాంటిస్ స్పేస్ షటిల్‌లో వ్యోమగాములు ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాగా, పోర్టబుల్ మ్యాకింతోశ్ కలిగి ఉన్న రిస్ట్‌మ్యాక్‌ను అప్పట్లో ఈ మెయిల్‌లను (Email) పంపడానికి ఉపయోగించారు.

ఇంతవరకు ఓపెన్ చేయలేదు..

న్యూయార్క్ టైమ్స్ (new york Times) నివేదిక ప్రకారం... భూమి, కాస్మోస్‌లో ఒక నిర్దిష్ట ఫీచర్ ఫోటోలను తీయడానికి “అట్లాంటిస్” మిషన్‌లో వ్యోమగాములకు (For astronauts) గుర్తు చేయడానికి ఈ స్మార్ట్‌వాచ్ ను ఉపయోగించారు. అయితే కామిక్‌ కనెక్ట్‌లో వేలానికి (auction) తయారవుతున్న ఈ రిస్ట్ మ్యాక్ యూనిట్​ను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. రిస్ట్‌మ్యాక్ వేలంపాటకు వచ్చే బిడ్లను ఈనెల 22 నుంచి డిసెంబర్ 18 వరకు స్వీకరించనున్నారు.

వేలంలో రూ. 37 లక్షలు పలికే అవకాశం..

ఈ వేలం పాటపై కామిక్‌ కనెక్ట్ సీఈఓ (CominConnect CEO), వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఫిష్లర్ మాట్లాడుతూ "ఇది నమ్మశక్యం కాని అన్వేషణ. కంప్యూటింగ్ టెక్నాలజీకి మొదటి ఉదాహరణల్లో ఈ రిస్ట్ మ్యాక్ (wrist Mac)​ ఒకటి." అని పేర్కొన్నారు. రిస్ట్‌మ్యాక్ 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పటికి చాలా అరుదుగా కనిపించిందన్నారు. కనెక్టికట్ మాక్‌ వేర్‌హౌస్ క్లోజింగ్-డౌన్ సేల్‌ (Conneticut Mac warehouse)లో వేలానికి వెళ్తున్న ఈ స్మార్ట్‌వాచ్ యూనిట్ ను అప్పట్లో $ 50 (సుమారు రూ. 3,700) కంటే తక్కువ ధరకు విక్రయించారు.

కొనుగోలుదారు అసలు ఈ ప్యాకింగ్‌ను కూడా తెరవలేదు. 1988 నాటి ఈ యాపిల్ ‘స్మార్ట్‌వాచ్’ రూ. 37 లక్షల వరకు వేలంలో ధర పలకవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత తరం నాటి ఈ రిస్ట్ మ్యాక్ ను సొంతం చేసుకునేందుకు యాపిల్ బ్రాండ్ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఆసక్తి గల వారు CominConnect.com ద్వారా వేలం ప్రక్రియలోపాల్గొనవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Apple, Technology, Watch price

తదుపరి వార్తలు