Business Idea | ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రూ.80లక్షల ఆదాయం.. ఆరు నెలల్లోనే...

ప్రస్తుతం అవినాష్ వద్ద ఏడుగురు ఫ్రీలాన్సర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే రెండు స్టార్టప్స్‌ను నెలకొల్పిన అవినాష్.. హైదరాబాద్ లేదా విశాఖ వేదికగా తన కంపెనీని ప్రారంభించాలని భావిస్తున్నాడు.


Updated: November 26, 2019, 3:26 PM IST
Business Idea | ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రూ.80లక్షల ఆదాయం.. ఆరు నెలల్లోనే...
ఎం.అవినాష్ (File)
  • Share this:
చాలా మంది యువత నేడు సోషల్ మీడియాలో టైం పాస్ చేయడానికి, వీడియోలు చూడడానికి, ఫ్రెండ్స్ నెంబర్స్ పెంచుకోవడానికి అన్నట్టుగా ఉంటున్నారు. అయితే, ఈ కుర్రాడు మాత్రం సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం ఎలాగో నేర్చుకున్నాడు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆరు నెలల కాలంలోనే రూ.80లక్షలు సంపాదించాడు. ఇంతకీ అతడి వయసు ఎంతో తెలుసా? కేవలం 19 సంవత్సరాలు. అతడి పేరు అవినాష్ మాదా. ఇన్‌స్టాగ్రామ్‌లో తన క్లైంట్స్‌కు డిజిటల్ మార్కెటింగ్ చేసి.. వారి వినియోగదారులు (ఫాలోయర్ల) సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నాడు. అందుకోసం ఒక్కో క్లైంట్ నుంచి 1000 డాలర్ల నుంచి 2000 డాలర్ల వరకు వసూలు చేస్తున్నాడు.

అవినాష్ కూడా మొదట్లో ఏదో సరదగా స్టార్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో మీమ్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో అతడికి బాగా ఫాలోయర్లు వచ్చారు. అతడి క్రియేటివిటీ చూసిన కొన్ని కంపెనీలు.. వారి ఉత్పత్తులను కూడా తన ఇన్‌స్టా పేజ్ వేదికగా ప్రమోట్ చేయాల్సిందిగా కోరాయి. దీంతో అతడు ఓకే చెప్పాడు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీలు కూడా అతడి క్లైంట్స్‌గా ఉన్నాయి.

తనలాగే, సోషల్ మీడియా వేదికగా డబ్బు సంపాదించాలనుకునే వారికోసం అవినాష్ ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చాడు. సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలని తెలుపుతూ సుమారు 100 వీడియోలు రెడీ చేశాడు. వాటిని ఆన్‌లైన్ కోర్స్ ద్వారా అందిస్తున్నాడు. అయితే, వాటిని తెలుసుకోలనే విద్యార్థులు ఒక్కొక్కరు 500 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. జనవరిలో ఈ ఆన్‌లైన్ కోర్స్‌ను ప్రారంభించబోతున్నాడు.

ప్రస్తుతం అవినాష్ వద్ద ఏడుగురు ఫ్రీలాన్సర్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే రెండు స్టార్టప్స్‌ను నెలకొల్పిన అవినాష్.. హైదరాబాద్ లేదా విశాఖ వేదికగా తన కంపెనీని ప్రారంభించాలని భావిస్తున్నాడు.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>