ఈ ఏడాది గూగుల్ సైన్స్ ఫెయిర్ కంటెస్ట్‌లో 18 మంది ఇండియన్ సైంటిస్టులు...

Google Science Fair 2019 : ఈ ఫెయిర్‌లో యంగ్ సైంటిస్టులు... ఆరోగ్యానికి సంబంధించిన అంశాలతోపాటూ... ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 27, 2019, 10:53 AM IST
ఈ ఏడాది గూగుల్ సైన్స్ ఫెయిర్ కంటెస్ట్‌లో 18 మంది ఇండియన్ సైంటిస్టులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రతిసారి లాగే ఈసారీ గూగుల్... సైన్స్‌, టెక్నాలజీలో సరికొత్త ఐడియాలను ప్రదర్శించే వారికి ఆఫర్ ప్రకటించింది. 100కు పైగా దేశాల నుంచీ వేలాది ఎంట్రీలు వచ్చాయి. ఈ కాంపిటీషన్‌లో 13-18 ఏళ్ల మధ్య ఉండే యువ సైంటిస్టులు... తమ ప్రతిభను చాటుతూ ప్రాజెక్టుల్ని ప్రదర్శిస్తుంటారు. అవి మన సొసైటీలో మనం రోజువారీ ఎదుర్కొనే చాలా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుంటాయి. గూగుల్ కాంపిటీషన్ ప్రధాన ఉద్దేశం అదే. ఇండియా నుంచీ 2019 గూగుల్ సైన్స్ ఫెయిర్‌కి 18 మంది యంగ్ సైంటిస్టులను ఎంపిక చేసింది. ఈ కంటెస్ట్‌లో విన్నింగ్ ప్రైజ్ మనీ $50,000 (రూ.34,92,595)తోపాటూ ఇతర బహుమతులూ ఉంటాయి.

ఈ ఫెయిర్‌లో యంగ్ సైంటిస్టులు... ఆరోగ్యానికి సంబంధించిన అంశాలతోపాటూ... ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులను కూడా ప్రదర్శిస్తారు. వేస్ట్ వాటర్‌ను సేవ్ చెయ్యడం, సురక్షిత నీటిని తాగేందుకు ఉపయోగపడే టెక్నిక్స్, వ్యర్థాల్ని తొలగించడం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి క్రియేటివ్ ఐడియాలను ప్రదర్శిస్తారు.

యూత్ క్రియేటివిటీ, సైంటిఫిక్ నాలెడ్జ్, మెరిట్, వంటివి పరిశీలించి... ప్రపంచవ్యాప్తంగా వంద మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేస్తున్నారు. విజేతలకు క్రోమ్‌బుక్‌తోపాటూ... కంపెనీ గూడీస్ కూడా ఇస్తున్నారు.

 ఇవి కూడా చదవండి :

నేడు వారణాసిలో రైతుల నామినేషన్... ప్రధాని మోదీకి పోటీ...

మా సభలకు కావాలనే జంతువుల్ని పంపిస్తున్నారు... బీజేపీ కార్యకర్తలపై మాయావతి ఫైర్...

ఇండియాలోకి ఉగ్రవాదులు వస్తారని ఊహించాడట... ఫేక్ కాల్ చేసినందుకు అరెస్ట్...

బూత్ లెవెల్లో టీడీపీ సర్వే... పూర్తి వివరాలు కోరిన చంద్రబాబు... గెలుపు లెక్కలు తేల్చేందుకు...

నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ
First published: April 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు