ఇక నుంచి ఫోన్ నంబర్‌లో 11 అంకెలు

news18-telugu
Updated: September 22, 2019, 11:11 AM IST
ఇక నుంచి ఫోన్ నంబర్‌లో 11 అంకెలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 22, 2019, 11:11 AM IST
సాధారణంగా మనం వాడుతున్న సెల్ ఫోన్ నెంబర్స్‌లో పది అంకెలుంటాయి. ఇప్పటివరకు మనదేశంలో సెల్ వాడుతున్న అందరి నెంబర్‌లో 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని 9తో ప్రారంభమయితే.. మరికొన్ని 8, 7 సిరీస్‌తో ప్రారంభంమయ్యాయి. అయితే భవిష్యత్తులో ఈ నెంబర్ 11కు చేరనుంది. 2050 నాటికి ఇండియాలో మొబైల్ నెంబర్లకు ఏర్పడే డిమాండ్‌ను అనుసరించి 11 అంకెలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 10 అంకెల నంబర్లతో 250 కోట్ల మందికి సేవలందించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి మొబైల్ నంబర్లు కావాలంటే, 11 అంకెలు కావాల్సిందే.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశంలో మొబైల్ ఫోన్ల నంబరింగ్ పథకాలను మార్చాలని ఇప్పటికే ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం మొబైల్ ఫోన్ నంబర్‌లోని అంకెలను 10 నుండి 11 కి పెంచడం పరిశీలనలో ఒకటి. అతి త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. మరో 30 సంవత్సరాల తరువాత ఏర్పడే డిమాండ్ కు అనుగుణంగా ఓ అంకెను పెంచాలన్న నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...