మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో(Android Phone) గూగుల్ యాప్స్(Google Apps) ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. ఎవరైనా గూగుల్‌లో(Google) ఏదైనా విషయం గురించి సెర్చ్ చేయాలనుకుంటే.. గూగుల్ యాప్ ఓపెన్ చేసి, వారి ప్రశ్నను టైప్ చేసి సెర్చ్(Search) చేస్తారు. కానీ ఆండ్రాయిడ్(Android), iOSలో గూగుల్ యాప్‌ను(Google Apps) సెర్చింగ్‌కే కాకుండా వివిధ రకాల సేవలు పొందడానికి కూడా వినియోగించవచ్చు. గూగుల్ యాప్‌తో మనకు అందుబాటులో ఉండే 11 హిడెన్ ఫీచర్స్ ఇవే..
ఒకేసారి సెర్చ్ విత్ టెక్స్ట్, ఇమేజెస్
ఇప్పుడు Google లెన్స్‌లో మల్టీ సెర్చ్ ఆప్షన్ ద్వారా ఒకే సమయంలో టెక్స్ట్ , ఇమేజెస్ ఉపయోగించి సెర్చ్ చేయవచ్చు. ఫోన్‌లో Google యాప్‌ను ఓపెన్ చేసి, లెన్స్ కెమెరా ఐకాన్‌ను క్లిక్ చేయాలి. స్క్రీన్‌షాట్‌లలో ఒకదానిని అప్‌లోడ్ చేసి సెర్చ్ చేయడం, లేదా ఫోటో తీసి అప్‌లోడ్ చేయడం చేయవచ్చు. ఆ తర్వాత + పై క్లిక్ చేసి టెక్స్ట్‌ను యాడ్ చేయవచ్చు.
* వాయిత్‌తో Google సెర్చ్
Google యాప్‌లో సెర్చ్ చేయడానికి వాయిస్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం యాప్‌లో మైక్ ఐకాన్‌ను నొక్కి, Googleలో మీ ప్రశ్నను చెప్పాలి. ఏదైనా పాట పేరు తెలుసుకోవాలనుకుంటే, మీరు మైక్ ఐకాన్‌ను ప్రెస్ చేసి సమాధానం తెలుసుకోవచ్చు.
* ఫాలో యువర్ ఇంట్రస్ట్స్ విత్ డిస్కవర్
Google యాప్‌లో Discoverని ఉపయోగించడం ద్వారా, సంగీతం, రాజకీయాలు, క్రీడలు వంటి ఆసక్తి ఉన్న రంగాలను ఫాలో అవ్వచ్చు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు తెలుసుకొనే వీలు ఉంటుంది. మీకు ఇష్టమైన అంశాలను ఫాలో, అన్ ఫాలో అయ్యే సదుపాయం ఉంది. వినియోగదారులు Google సెర్చ్ రిజల్ట్ నుంచి లింక్‌లు, ఇమేజెస్, స్థలాలను కూడా సేవ్ చేయవచ్చు.
* క్యాలెండర్‌ను అప్‌డేట్‌గా ఉంచండి
గూగుల్ అసిస్టెంట్‌తో క్యాలెండర్ ఈవెంట్‌లు, రాబోయే సమావేశాల వంటి క్యాలెండర్ అప్‌డేట్‌లను సృష్టించవచ్చు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే హెచ్చరించడానికి నోటిఫికేషన్‌లను కూడా సెట్ చేయవచ్చు.
* కాపీ హ్యాండ్‌రిటెన్ నోట్స్
ఫోన్ లేదా ఏదైనా డివైజ్ నుంచి Google లెన్స్‌తో చేతితో రాసిన అక్షరాలను కాపీ చేసి అదే అకౌంట్‌తో లాగిన్ అయిన మరో డివైజ్‌లో పేస్ట్ చేయవచ్చు.
* మేక్ కాల్స్, మెసేజెస్ వయా గూగుల్ అసిస్టెంట్
Google యాప్‌లో గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్‌ని ఉపయోగించి కాల్‌లు చేయవచ్చు, టెక్స్ట్ మెసేజ్‌లు పంపవచ్చు.
* ఆటోఫిల్ అడ్రెస్, పేమెంట్ ఇన్‌ఫర్మేషన్
Google యాప్‌తో త్వరగా ట్రాన్సాక్షన్‌లు జరపడానికి అడ్రెస్, చెల్లింపుల వివరాలు సేవ్ చేసి ఆటోఫిల్ చేయవచ్చు.
* లెర్న్‌న్యూ ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్
Google యాప్ వినియోగదారులకు కొత్త అంశాలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. సంక్లిష్ట సమస్యలను విభజించడం ద్వారా అర్థం చేసుకొనేలా చేస్తుంది.
* ట్రాన్స్‌లేట్
Google ప్రకారం లెన్స్ స్పానిష్, అరబిక్‌తో సహా 100 కంటే ఎక్కువ భాషలను అనువదించగలదు. భాషపై మీ పట్టును మెరుగుపరచుకోవడానికి, వాటి ఉచ్చారణను వినడానికి అవకాశం ఉంది.
* హోంవర్క్‌లో సహాయం పొందండి
హోమ్‌వర్క్ సమస్య ఉన్నప్పుడు Google లెన్స్ నిర్దిష్ట సబ్జెక్టులలో విద్యార్థులకు కూడా సహాయం చేస్తుంది. గణితం, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ అంశాలపై సహాయపడటానికి దశల వారీ మార్గదర్శకాలు, వీడియోలు ఉన్నాయి.
* ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)ని ఉపయోగించండి
Google లెన్స్‌తో 3D వస్తువులు, కాన్సెప్ట్‌లను వీక్షించవచ్చు. జంతువువులు, ప్రపంచ స్మారక చిహ్నాలు, ఇష్టమైన అథ్లెట్‌ల వరకు సెర్చ్ చేసి నిజంగా చూసిన అనుభూతిని పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Apps, Google, Technology