#10YearChallenge: టెన్ ఇయర్ ఛాలెంజ్ వెనుక కుట్ర ఉందా? ఖండించిన ఫేస్‌బుక్

#10YearChallenge | ఈ స్వీకరించి ఫోటోలు పోస్ట్ చేస్తున్నవాళ్లంతా మురిసిపోతున్నారు కానీ... టెక్ మ్యాగజైన్ వైర్డ్ ఓ సంచలన విషయం బయటపెడ్డింది. ఫేషియల్ రికగ్నిషన్ ఆల్గరిథమ్స్‌ని రూపొందించేందుకు ఫేస్‌బుక్ ఈ ఛాలెంజ్‌ను వైరల్ చేస్తోందంటూ వైర్డ్‌లో టెక్ ఆంట్రప్రెన్యూర్, రైటర్ కేట్ ఓ నీల్ కథనాన్ని రాశారు.

news18-telugu
Updated: January 17, 2019, 2:48 PM IST
#10YearChallenge: టెన్ ఇయర్ ఛాలెంజ్ వెనుక కుట్ర ఉందా? ఖండించిన ఫేస్‌బుక్
#10YearChallenge: టెన్ ఇయర్ ఛాలెంజ్ వెనుక కుట్ర ఉందా? ఖండించిన ఫేస్‌బుక్
news18-telugu
Updated: January 17, 2019, 2:48 PM IST
#10YearChallenge... టెన్ ఇయర్ ఛాలెంజ్. గతేడాది కీకీ ఛాలెంజ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అంతే వైరల్‌గా మారిన ఛాలెంజ్ ఇది. పదేళ్ల ముందు మీరెలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటూ పాత, కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఈ ఛాలెంజ్ ఏదో బాగుందనుకొని అందరూ తమ పాత ఫోటోలను తవ్వితీస్తున్నారు. వాటికి కొత్త ఫోటోలను జత చేసి మేం అప్పుడు అలా ఉండేవాళ్లం, ఇప్పుడు ఇలా ఉన్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీలు, ప్రముఖులు #10YearChallenge స్వీకరించి తమ ఫోటోలు పోస్ట్ చేశారు. శృతి హాసన్, లావణ్య త్రిపాఠి, పద్మ లక్ష్మి లాంటివాళ్లు తమ ఫోటోలను ఇలా పోస్ట్ చేశారు.



 




Loading...

View this post on Instagram




 

Me after a sip of coconut water 🥥💧1999/2019.... not quite the #10yearchallenge. More like the #20yearchallenge!


A post shared by Padma Lakshmi (@padmalakshmi) on











 




View this post on Instagram




 

#10yearchallenge only change i majorly see is the upgrade to an iphone..


A post shared by Lavanya T (@itsmelavanya) on





#10YearChallenge స్వీకరించి ఫోటోలు పోస్ట్ చేస్తున్నవాళ్లంతా మురిసిపోతున్నారు కానీ... టెక్ మ్యాగజైన్ వైర్డ్ ఓ సంచలన విషయం బయటపెడ్డింది. ఫేషియల్ రికగ్నిషన్ ఆల్గరిథమ్స్‌ని రూపొందించేందుకు ఫేస్‌బుక్ ఈ ఛాలెంజ్‌ను వైరల్ చేస్తోందంటూ వైర్డ్‌లో టెక్ ఆంట్రప్రెన్యూర్, రైటర్ కేట్ ఓ నీల్ కథనాన్ని రాశారు. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, డెప్త్, బ్రెడ్త్, పదేళ్లలో మొహంలో వచ్చే మార్పులను గుర్తించి ఆల్గరిథమ్స్ రూపొందించడమే ఈ ఛాలెంజ్ లక్ష్యం అన్నది ఆ కథనం సారాంశం. ఈ కథనం కాస్తా సంచలనంగా మారింది.


అయితే ఫేషియల్ రికగ్నిషన్ ఆల్గరిథమ్స్ రూపొందించేందుకే #10YearChallenge ప్రారంభించిందంటూ వచ్చిన ఆరోపణల్ని ఫేస్‌బుక్ ఖండించింది. ఇది ఎవరో యూజర్ మా ప్రమేయం లేకుండా క్రియేట్ చేసిన ఛాలెంజ్ అంటూ ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది.


#10YearChallenge ఫేస్‌బుక్‌లోనే కాదు, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌‌లోనూ వైరల్‌గా మారింది. ఇప్పటికే అనేకమంది టెన్ ఇయర్ ఛాలెంజ్‌లో భాగంగా పాత, కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మరి నిజంగా ఈ ఛాలెంజ్ వెనుక కుట్ర ఉందా? లేక ఎవరైనా యూజర్ క్రియేట్ చేసిందేనా? ఇది కనుక్కోవడం కష్టమే.

ఇవి కూడా చదవండి:

Amazon vs Flipkart: పోటాపోటీగా సేల్స్... ఆఫర్లు ఇవే తెలుసుకోండి

WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?
First published: January 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...