Home /News /technology /

10GB 4G DATA PER USER PER MONTH IN DECEMBER 2018 INDIA WITNESSED OVERALL MOBILE DATA TRAFFIC GROWTH BY 109 PERCENT IN 2018 SS

నెలకు 10 జీబీ... 4జీ డేటా ఫుల్లుగా వాడేస్తున్నారుగా...

నెలకు 10 జీబీ... 4జీ డేటా ఫుల్లుగా వాడేస్తున్నారుగా...

నెలకు 10 జీబీ... 4జీ డేటా ఫుల్లుగా వాడేస్తున్నారుగా...

మొత్తంగా 109 శాతం డేటా వినియోగం పెరిగితే, సగటు డేటా వినియోగం 69 శాతం పెరిగింది. డిసెంబర్ 2018 లెక్కల ప్రకారం ఒకరు నెలకు 10జీబీ డేటా వాడేస్తున్నారు.

    భారతీయులు మొబైల్ డేటా ఫుల్లుగా వాడేస్తున్నారు. 2018లో 109 శాతం డేటా వినియోగం పెరిగింది. ఇందుకు కారణం 4జీ నెట్వర్క్ అని తాజా అధ్యయనం తేల్చింది. భారతదేశంలో డేటా వినియోగంపై మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్(MBiT) పేరుతో నోకియా వార్షిక అధ్యయన నివేదిక విడుదల చేసింది. మొత్తంగా 109 శాతం డేటా వినియోగం పెరిగితే, సగటు డేటా వినియోగం 69 శాతం పెరిగింది. డిసెంబర్ 2018 లెక్కల ప్రకారం ఒకరు నెలకు 10జీబీ డేటా వాడేస్తున్నారు.

    Read this: Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన

    ప్రస్తుతం 3జీ డేటా ధరకే 4జీ డేటా వచ్చేస్తోంది. దీంతో 3జీ డేటాకు డిమాండ్ తగ్గింది. 2018లో 4జీ యూజర్ల సంఖ్య 137 శాతం పెరిగింది. చాలామంది 3జీ నుంచి 4జీకి మారడం, 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు కొనడం వల్ల ఇండియాలో 4జీ డేటా వినియోగం పెరిగింది. వీడియో స్ట్రీమింగ్, మీడియా యాప్స్ కారణంగా 2018లో చిన్నచిన్న పట్టణాల్లో కూడా 4జీ ట్రాఫిక్ పెరిగింది. స్థానిక భాషలో వీడియో కంటెంట్ లభిస్తుండటం, ఓవర్-ది-టాప్(OTT) అప్లికేషన్స్ పెరగడం, టిక్‌టాక్ లాంటి మీడియా అప్లికేషన్స్ వల్ల వీడియోలు చూసేవారి సంఖ్య పెరిగింది. 2018లో 4జీ వినియోగం పెరగడానికి ఇలా అనేక కారణాలున్నాయి.

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చూడండి:

    Personal Finance: మీ బ్యాంక్ అకౌంట్ వాడట్లేదా? ఇలా క్లోజ్ చేసెయ్యండి

    PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

    Personal Finance: జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు ఈ 5 బ్యాంకులు బెస్ట్
    First published:

    Tags: 4G, Mobile Data, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు