హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Games: కరోనా తరువాత పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ గేమ్స్ డౌన్‌లోడ్లు.. యూజర్లు లైక్ చేసిన టాప్-10 గేమ్స్ ఇవే

Smartphone Games: కరోనా తరువాత పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ గేమ్స్ డౌన్‌లోడ్లు.. యూజర్లు లైక్ చేసిన టాప్-10 గేమ్స్ ఇవే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోవిడ్ అనంతరం యువత యాప్స్‌కు కేటాయించే సమయం సైతం 40 శాతం పెరిగిందట. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ గేమ్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని డౌన్‌లోడ్లను బట్టి తెలుస్తోంది.

కరోనా తరువాత మొబైల్ గేమింగ్ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఏడాది ఈ పరిశ్రమ సుమారు 100 బిలియన్ డాలర్ల బిజినెస్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. కోవిడ్ అనంతరం యువత యాప్స్‌కు కేటాయించే సమయం సైతం 40 శాతం పెరిగిందట. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ గేమ్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని డౌన్‌లోడ్లను బట్టి తెలుస్తోంది. అయితే మొబైల్ గేమ్స్ కోసం ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో 2021 మొదటి ఆరు నెలల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఎక్కువగా ఆడిన 10 స్మార్ట్‌ఫోన్ గేమ్స్ గురించి తెలుసుకుందాం.

Google Meet: మీరు గూగుల్ మీట్ వినియోగిస్తారా? అయితే, ఈ అదిరిపోయే కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి

1. PUBG మొబైల్ గేమ్(PUBG MOBILE)

ఈ లిస్ట్‌లో పబ్జీ గేమ్ ముందు వరుసలో ఉంది. గతంలో భారత్‌లో బ్యాన్ అయిన పబ్జీని కొత్తగా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో లాంచ్ చేశారు. ఈ గేమ్ బాటిల్ రాయల్ మోడ్‌లో 100 మంది వరకు ఆడే అవకాశం ఉంది. 4v4 టీమ్ డెత్‌మ్యాచ్, జాంబీ మోడ్‌లు వంటివి యూత్‌ను బాగా ఆకర్షించాయి.

2. క్యాండీ క్రష్ సాగా(Candy Crush Saga)

క్యాండీలను మార్చుతూ, సెట్ చేస్తూ ఆడే ఈ ఆటను ఒక్కరు లేదా స్నేహితులతో కలిసి ఆడవచ్చు. మంచి టైమ్ పాస్ గేమ్‌గా దీనికి గుర్తింపు ఉంది.

3. Honour of Kings

హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్ ఇంటర్నేషనల్ వెర్షన్‌ పేరు అరేనా ఆఫ్ వలూర్ (Arena of Valor). ఈ మల్టీప్లేయర్ ఆన్‌లైన్ బ్యాటిల్ అరేనా (MOBA) గేమ్.. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా యూత్‌ను ఆకర్షిస్తోంది.

4. Among Us

InnerSloth సంస్థ అభివృద్ధి చేసిన ఈ గేమ్‌ను నాలుగు నుంచి పది మంది ఆటగాళ్లు ఆడవచ్చు. స్పేస్ షిప్, సిబ్బంది అపహరణ నేపథ్యంలో ఈ గేమ్‌ను డిజైన్ చేశారు.

5. Ludo King

ఈ క్లాసిక్ బోర్డ్ గేమ్‌ను నలుగురు వరకు ఆడవచ్చు. వీడియో చాట్ సపోర్ట్‌తో వచ్చిన ఈ గేమ్ ఎంతోమందికి ఫేవరెట్ గేమ్‌గా మారింది.

6. ROBLOX

ఫుల్ క్రాస్-ప్లాట్‌ఫారం సపోర్ట్‌తో వచ్చే ఈ గేమ్‌ను ఆడేందుకు చాలామంది యూజర్లు ఆసక్తి చూపుతారు. కంప్యూటర్లు, మొబైల్ డివైజ్‌లు, Xbox One, VR హెడ్‌సెట్‌లను ఉపయోగిస్తూ ఈ గేమ్ ఆడుకోవచ్చు.

7. Free Fire

ఈ సర్వైవల్ షూటర్ గేమ్ మొబైల్‌లో అందుబాటులో ఉంది. ఇది 10 నిమిషాల గేమ్ ప్లేతో వస్తుంది.

8. Game For Peace

గేమ్ ఫర్ పీస్ అనేది PUBG మొబైల్ చైనీస్ వెర్షన్. ఒరిజినల్ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసి దీన్ని అభివృద్ధి చేశారు.

9. Call of Duty: Mobile

ఇది మల్టీప్లేయర్ మ్యాప్‌లు, వివిధ మోడ్‌లతో అందుబాటులో ఉంది. 100 ప్లేయర్ బ్యాటిల్ రాయల్ బ్యాటిల్‌గ్రౌండ్, 5v5 టీమ్ డెత్‌మ్యాచ్ వంటి మోడ్‌లతో ఈ గేమ్ అందుబాటులో ఉంది.

10. Minecraft Pocket Edition

ఈ మల్టీప్లేయర్ గేమ్‌లో 10 మంది స్నేహితులను క్రాస్ ప్లాట్‌ఫారమ్‌గా చేర్చుకోవచ్చు. ఇల్లు, కోటలు వంటి కట్టడాలు నిర్మించే బ్యాక్‌డ్రాఫ్ట్‌తో ఈ గేమ్‌ను డిజైన్ చేశారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Games, PUBG Mobile India, Smartphone, Video Games

ఉత్తమ కథలు