Home /News /technology /

10 COUNTRIES WHERE MOBILE DATA IS CHEAPEST LIST IS HERE FIND OUT WHERE INDIA RANKS SU GH

Mobile Data: తక్కువ ధరకే మొబైల్ డేటా ఆఫర్ చేస్తున్న 10 దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బైల్ డేటా ధరలు మాత్రం అన్ని దేశాల్లో ఒకేలా లేవు. కొన్ని దేశాల్లో ఒక్క జీబీ డేటా రూ.500కు లభిస్తే.. మరికొన్ని దేశాల్లో 3 రూపాయలకే 1 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ మొబైల్ డేటా ధరలు మాత్రం అన్ని దేశాల్లో ఒకేలా లేవు. కొన్ని దేశాల్లో ఒక్క జీబీ డేటా రూ.500కు లభిస్తే.. మరికొన్ని దేశాల్లో 3 రూపాయలకే 1 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అయితే ఏయే దేశాల్లో తక్కువ ధరకు మొబైల్ డేటా లభిస్తుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ కంపేరిజన్ ఫ్లాట్ ఫామ్ అయిన "కేబుల్" సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకు 221 ప్రాంతాల నుంచి 6,148 మొబైల్ డేటా ప్లాన్‌లకు సంబంధించిన సమాచారాన్ని కేబుల్ సేకరించింది. అనంతరం డేటాను విశ్లేషించి అత్యంత చౌకైన ధరలకు మొబైల్ డేటా ఆఫర్ చేసే దేశాల జాబితాను తయారు చేసింది. ఈ జాబితాలో ఉన్న దేశాలు ఏవో తెలుసుకుందాం.

10: చిలీ
చిలీ దేశంలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.39 డాలర్లు. అంటే.. భారత కరెన్సీలో 29 రూపాయలు.

9: శ్రీలంక
శ్రీలంకలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.38 డాలర్లు. మన భారత కరెన్సీలో 28 రూపాయలు.

8: బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.34 డాలర్లు. భారత కరెన్సీలో దీని విలువ 25 రూపాయలు.

7: మాల్డోవా
యూరప్‌లోని మాల్డోవా దేశంలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.32 డాలర్లు. మన కరెన్సీలో దీని విలువ 23 రూపాయలు.

6: రష్యా
రష్యాలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.29 డాలర్లు. భారత కరెన్సీలో ఇది 21 రూపాయలకు సమానం.

5: సూడాన్
సూడాన్ దేశంలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.27 డాలర్లు. మన కరెన్సీలో ఇది 20 రూపాయలు.

4: ఇటలీ
ఇటలీలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.27 డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది 20 రూపాయలకు సమానం.

3: ఫిజి
ఫిజి దేశంలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.19 డాలర్లు. భారత కరెన్సీలో ఇది 14 రూపాయలు.

2: కిర్గిజ్‌స్థాన్
కిర్గిజ్‌స్థాన్ దేశంలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.15 డాలర్లు. భారత కరెన్సీలో ఇది 11 రూపాయల వరకు ఉంటుంది.

1: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ దేశంలో 1 జీబీ మొబైల్ డేటా ధర 0.05 డాలర్లు. మన కరెన్సీలో ఇది కేవలం మూడు రూపాయలు మాత్రమే.

భారత్ నంబర్ 28: భారతదేశంలో 1 జీబీ మొబైల్ డేటా సగటు ధర 0.68 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో దీని విలువ 50 రూపాయలు. అంటే.. భారత్‌లో ఒక జీబీ డేటా కోసం సగటున 50 రూపాయలు ఖర్చు చేయాల్సిందేనని కేబుల్ నివేదిక వెల్లడించింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: India, Mobile Data

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు