జినెడిన్ జిడాన్ అనూహ్య నిర్ణయం

రియల్ మాడ్రిడ్ జట్టు ఛాంపియన్స్ లీగ్ హ్యాట్రిక్ విజయం సాధించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ జట్టు కోచ్ పదవి నుంచి వైదొలగుతూ జిడాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

Janardhan V | news18
Updated: June 1, 2018, 4:57 AM IST
జినెడిన్ జిడాన్ అనూహ్య నిర్ణయం
ZInedine Zidane speaking during the press conference as Florentino Perez watches on. (AFP Image)
  • News18
  • Last Updated: June 1, 2018, 4:57 AM IST
  • Share this:
Zinedine Zidane Bids Emotional Farewell to Real Madrid
ZInedine Zidane speaking during the press conference as Florentino Perez watches on. (AFP Image)


ఫ్రాన్స్ మాజీ దిగ్గజ ఫుట్‌బాల్ ఆడగాడు జినెడిన్ జిడాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ జెయింట్స్ ‘రియల్ మాడ్రిడ్’ కోచ్ పదవి నుంచి జిడాన్ వైదొలిగాడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు జిడాన్ 2016 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన యూరఫ్ ఛాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్‌‌లో లివర్‌పూల్ జట్టును 3-1 గోల్స్ తేడాతో రియల్ మాడ్రిడ్ మట్టికరిపించి టైటిల్ గెలిచింది. ఈ విజయం సాధించిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు జిడాన్ ప్రకటించాడు.

వచ్చే సీజన్‌కు రియల్ జట్టుకు పనిచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు జిడాన్ తెలిపాడు. ప్రస్తుతం మార్పు అనివార్యమని భావిస్తున్నట్లు చెప్పాడు. బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ అన్నా...దాని అధ్యక్షుడిపైనా తనకు ఎంతో ప్రేమ ఉందన్నాడు. క్లబ్‌లో ఆటగాడిగా, కోచ్‌గా పనిచేసేందుకు రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ప్లోరెంటినో పెరెస్ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

జిడాన్ నిర్ణయం అనూహ్యమైందని రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ప్లోరెంటినో పెరెస్ తెలిపాడు. ఫ్రాన్స్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు జిడాన్ ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారని చెప్పాడు. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరినా ఫలితం లేకపోయిందన్నాడు. భవిష్యత్తులో జట్టుకు సేవలందించేందుకు జిడాన్ మళ్లీ వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశాడు.

ఛాంపియన్స్ లీగ్‌ను గెలిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే రియల్ మాడ్రిడ్‌కు జిడాన్ గుడ్‌‌బై చెప్పడం ఆ క్లబ్ ఆటగాళ్లు, న్స్‌ను కూడా విస్మయానికి గురిచేస్తోంది. జిడాన్ స్థానంలో రియల్ మాడ్రిడ్ జట్టు కొత్త కోచ్‌గా ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించలేదు. కొత్త కోచ్‌గా ఎవరు రానున్నారన్నది ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
Published by: Janardhan V
First published: June 1, 2018, 4:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading