Home /News /sports /

ZIMBABWE VS PAKISTAN ARSHAD IQBALS BOUNCER BREAKS BATSMANS HELMET INTO TWO HALVES SA

Zim vs Pak 2nd T20I :షాకింగ్.. బౌన్సర్‌కు దాటికి రెండు భాగాలైన హెల్మెట్‌!

bouncer breaks batsman’s helmet

bouncer breaks batsman’s helmet

బౌన్సర్‌ దాటికి హెల్మెట్‌ రెండు ముక్కలైంది. పాకిస్థాన్‌-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.



    బౌలర్స్ దాటికి బ్యాట్స్‌మెన్స్ గాయపడడం లేదా వికెట్స్ గింగిరాలు తిరుగుతూ గాల్లో ఎగరడం లేదా విరిగిపోవడం చూస్తుంటాం. కానీ తాజాగా బౌన్సర్‌ దాటికి హెల్మెట్‌ రెండు ముక్కలైంది. పాకిస్థాన్‌-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న పేస్‌ బౌలర్‌ అర్షద్‌ ఇక్కాల్‌ తను వేసిన రెండో ఓవర్‌లో ఓ బంతిని జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ తినాషే కామున్హుకామ్వే హిట్‌ చేయాబోయాడు. ఇంతలో ఆ బంతి అతని హెల్మెట్‌కు తగిలి పైన ఉన్న లేయర్‌ ఒక్కసారిగా ఊడి కిందపడింది. దీంతో హెల్మెట్‌ రెండు ముక్కలైంది. ఈ ఘటనలో బ్యాట్స్‌మన్‌ తినాషేకు ఎలాంటి గాయం కాలేదు. తగిలి హెల్మెట్‌ అవుటర్‌ లేయర్‌ లేచి నేలపై పడటం కలవరపాటుకు గురిచేసింది. అలాగే ఈ దృశ్యం చూసినవారిని కాస్త ఆందళోనకు గురిచేసింది.





    ఇదిలా ఉండగా ఈ టీ20 మ్యాచ్‌లో పాక్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది జింబాబ్వే. దీంతో టీ20 సీరిస్‌ను తన ఖాతలో వేసుకుంది. ఇక ఈ మూడు టీ20ల సిరీస్‌లో పాక్‌తో జరిగిన రెండో టీ20లో 19 పరుగుల తేడాతో పాక్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మెుదటి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే లోస్కోర్ చేసినప్పటికి.. పాక్ ఆ స్కోర్‌ను చేధించలేకపోయింది. పాకిస్తాన్ బౌలర్లు జింబాబ్వేను 20 ఓవర్లలో 118/9 పరుగులకే పరిమితం చేశారు. తర్వాత పాక్ 19.5 ఓవర్లలో 99 పరుగులు చేసి 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్ధిని కనీసం మూడంకెల స్కోర్‌ కూడా చేయనీయకుండా జింబాబ్వే ఆలౌట్‌ చేసింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Pakistan, Zimbabwe

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు