Home /News /sports /

ZIM VS BAN FRUSTRATED MUZARABANI WENT UP TO AHMED AND EXCHANGED A FEW WORDS WITH THE TASKIN VIDEO GOES VIRAL SRD

ZIM vs BAN : బంగ్లా ఆటగాడి డ్యాన్స్..కోపంతో ఊగిపోయిన జింబాబ్వే బౌలర్ ఏం చేశాడంటే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

ZIM vs BAN : క్రికెట్ లో ఆటగాళ్లు అప్పుడప్పుడూ సహనం కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. మైదానంలో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా..అప్పడప్పుడు ప్లేయర్ల మధ్య గొడవలు కామన్ గా జరుగుతుంటాయ్. ముఖ్యంగా బ్యాట్స్ మన్, బౌలర్ మధ్య జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు.

ఇంకా చదవండి ...
    క్రికెట్ లో ఆటగాళ్లు అప్పుడప్పుడూ సహనం కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. మైదానంలో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా..అప్పడప్పుడు ప్లేయర్ల మధ్య గొడవలు కామన్ గా జరుగుతుంటాయ్. ముఖ్యంగా బ్యాట్స్ మన్, బౌలర్ మధ్య జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. లేటెస్ట్ గా ఇలాంటి ఘటన బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. జింబాబ్వే టూర్ కు వచ్చిన బంగ్లాదేశ్ టీం.. ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా టీమ్ 468 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే టీం కూడా బాగానే ఆడుతోంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే జట్టు వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. అయితే, రెండవ రోజు ఆటలో ఆటగాళ్ల మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే క్రికెట్‌లో ఇలాంటి గొడవలు చాలానే చూస్తుంటాం కదా ఇందులో ఏముంది విశేషం అనుకుంటున్నారా.. అదే మీరు ఆ వీడియో చూడాల్సింది. అసలు విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ టీమ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాన్ టస్కిన్ అహ్మద్ తన కెరీర్‌లోనే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జింబాబ్వే బౌలర్లకు తలనొప్పిలా మారిన బంగ్లా బ్యాట్స్‌మెన్ పై జింబాబ్వే బౌలర్లు దాడికి దిగారు. 85వ ఓవర్‌లో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    బంగ్లా బ్యాట్స్ మెన్ టాస్కిన్, జింబాబ్వే బౌలర్ ముజారబాని గొడవ పడ్డారు. 85 వ ఓవర్‌లో నాలుగవ బంతిని షార్ట్ బంతిగా వదిలాడు. దానిని టాస్కిన్ బాగానే ఎదుర్కొన్నాడు. అనంతరం చిన్న స్టెప్ వేశాడు. దీనిని తట్టుకోలేని జింబాబ్వే బౌలర్ ముజారబాని బంగ్లా బ్యాట్స్‌మెన్ చెంతకు చేరి మాటలతో దాడి చేసినట్లు కనిపించింది. ఇద్దరు మాటలతో రెచ్చిపోయారు. అయితే ఒకరి తలను మరొకరు రుద్దుకుంటూ నోటికి పనిచెప్పారు. కొద్దిసేపు వారి హావభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఒకరినొకరు మీదికి తోసుకుంటూ ఏదో తిట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరలవుతోంది.


    టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టస్కిన్ అహ్మద్ 75 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్‌లోనే అతిపెద్ద స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 7 టెస్టులు ఆడిన టాస్కిన్ కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. 10వ వికెట్ కు మహ్మదుల్లాతో కలిసి 191 పరుగులు జోడించాడు. దీంతో జింబాబ్వే బౌలర్ల సహనం కోల్పోయారు. మరోవైపు జింబాబ్వే బౌలర్ ముజారబాని తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangladesh, Cricket, Viral Video, Zimbabwe

    తదుపరి వార్తలు