విరాట్ కొహ్లీ కంటే బజ్‌రంగ్, వినేష్‌లకే ఎక్కువ పాయింట్స్!!!

క్రికెటర్లకు భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న ప్రకటించడం వివాదానికి దారి తీసింది. ఎటువంటి పాయింట్స్ రాకున్నా విరాట్ కొహ్లీకి ఖేల్ రత్న ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: September 21, 2018, 11:38 AM IST
విరాట్ కొహ్లీ కంటే బజ్‌రంగ్, వినేష్‌లకే ఎక్కువ పాయింట్స్!!!
బజరంగ్ పూనియా, విరాట్ కొహ్లీ, వినేష్ ఫోగట్ ( Twitter Photos)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చానులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకోనున్నారు. క్రికెటర్ అయిన విరాట్‌కు భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న ప్రకటించడం వివాదస్పదంగా మారింది. ఖేల్ రత్న అవార్డ్‌‌ ఇచ్చేందుకు ఎలాంటి ప్రమాణాలు లేనందున ఒలింపిక్ క్రీడ కానటువంటి క్రికెట్‌లో ఆటగాడిగా ఉన్న విరాట్‌ కొహ్లీ ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేదు. టీమిండియా కెప్టెన్ కంటే భారత రెజ్లర్ బజరంగ్ పునియా, మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ వ్యక్తిగతంగా ఎక్కువ పాయింట్లు పొందారు.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు నిర్ణయించడానికి 11 మంది సభ్యుల బృందం.. అవార్డ్ కోసం ప్రతిపాదించిన క్రీడాకారుల ప్రదర్శన,ఘనతలను పరిశీలించింది. మార్కింగ్ స్కీమ్ ద్వారా క్రీడాకారులకు పాయింట్స్ ఇచ్చారు. ఈ స్కీమ్ ప్రకారం మీరాబాయి చానుకు 44 పాయింట్లు రాగా...టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సున్నా పాయింట్లు లభించాయి. ఇదే అవార్డ్ రేస్‌లో నిలిచిన రెజ్లర్ బజరంగ్ పునియా, మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌లకు సమానంగా 80 పాయింట్లు వచ్చాయి. బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ 2018 ఆసియా గేమ్స్‌‌లో తమ తమ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారు. బజరంగ్ పూనియా వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లోనే భారత్‌కు పతకాలు అందించాడు. అయినా ఈ ఇద్దరిలో ఒక్కరికి కూడా ఖేల్‌ రత్న పురస్కారం దక్కలేదు.

ఎటువంటి పాయింట్స్ రాకున్నా విరాట్ కొహ్లీకి ఖేల్ రత్న ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఒలింపిక్ క్రీడ కానటువంటి క్రికెట్‌లో ఎన్ని ఘనతలు సాధించినా...ఆసియా గేమ్స్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులు, అథ్లెట్లకే..ఖేల్ రత్న ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి ఇద్దరు క్రికెటర్లకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఖేల్ రత్న అందించింది. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ , భారత ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు భారత అత్యున్నత క్రీడా పురస్కారం దక్కింది. 1997లో సచిన్ టెండుల్కర్,2007లో ధోనీ ఈ ఘనత సొంతం చేసుకున్నారు.First published: September 21, 2018, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading