టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజవేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ యూట్యూబర్ గా వెరీ ఫేమస్..ఆమె డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డ్యాన్సర్ గా ధనశ్రీకి మంచి పేరు ఉంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఆమె ఎంతో చురుకుగా ఉంటుంది. అభిషేక్ బచ్చన్ నటించిన బ్లఫ్‌మాస్టర్ చిత్రంలోని బురోబురో (Bure Bure and Boro Boro) పాటకు ధనశ్రీ డ్యాన్స్ చేసింది. అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టింది. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోగా లక్షల్లో లైకులు వస్తున్నాయ్. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది. కొద్ది రోజుల క్రితం కౌన్సా నషా కర్తాహై..” (Kaunsa nasha Kartahai) అనే పాటకు కూడా డ్యాన్స్ ఇరగదీసింది ధనశ్రీ. డిసెంబర్ 22న ప్రేమ పెళ్లి చేసుకున్న చాహల్-ధనశ్రీలు ఇటీవలే హనీమూన్ నుంచి తిరిగి వచ్చారు.
ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే తొలుత డాక్టర్ కావాలనుకున్న ఆమె ఆతరువాత డ్యాన్సింగ్ నే కెరీర్ గా ఎంచుకుని కొరియోగ్రఫర్ గా దూసుకుపోతున్నారు. డ్యాన్సర్ గా ఆమె ఎనర్జీ లెవెల్, ఉత్సాహం, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ సూపర్బ్ అంటూ నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె టాలెంట్ పై వేలల్లో కాంప్లిమెంట్లు పోటెత్తటంతో కామెంట్ బాక్స్ నిండిపోతోంది. వీడియోను పోస్ట్ చేస్తూనే .. "చెప్పండి ఇందులో ఫైర్ ఉందా లేదా" అంటూ ప్రశ్నించారు ధనశ్రీ. గత నెలలో కరోనా ఎఫెక్ట్ తో వీరిద్దరి పెళ్లి చడీ చప్పుడు లేకుండా జరిగిపోయింది. దీంతో తమ అభిమానుల కోసం పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Published by:Sridhar Reddy
First published:January 21, 2021, 21:28 IST