• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YUZVENDRA CHAHALS WIFE DHANASHREE VERMA DANCE WITH SHIKHAR DHAWAN VIDEO GOES VIRAL SRD

Viral Video : శిఖర్ ధావన్ తో చాహల్ భార్య భాంగ్రా డ్యాన్స్..ఇద్దరూ ఇరగదీశారుగా..

Viral Video : శిఖర్ ధావన్ తో చాహల్ భార్య భాంగ్రా డ్యాన్స్..ఇద్దరూ ఇరగదీశారుగా..

Photo Credit : Instagram

Viral Video : టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ (Yuzvendra Chahal) భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma) సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంటాయ్. లేటెస్ట్ గా గబ్బర్ తో కలిసి చిందులేసింది ధనశ్రీ వర్మ.

  • Share this:
    టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ (Yuzvendra Chahal) సతీమణి ధనశ్రీ వర్మ (Dhanashree Verma) యూట్యూబర్ గా వెరీ ఫేమస్..ఆమె డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డ్యాన్సర్ గా ధనశ్రీకి మంచి పేరు ఉంది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఆమె ఎంతో చురుకుగా ఉంటుంది. లేటెస్ట్ గా ఈ భామ.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తో కలిసి భాంగ్రా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'భాంగ్రా ఇన్ గ‌బ్బ‌ర్ స్టైల్' అంటూ ధ‌న‌శ్రీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ధావన్, ధనశ్రీ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను ధ‌న‌శ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గంట‌లోపే ల‌క్ష‌ల సంఖ్య‌లో లైక్స్, వంద‌ల కామెంట్స్ రావ‌డం విశేషం. ముందుగా శిఖర్ ధావన్‌ భాంగ్రా డ్యాన్స్‌ చేయగా.. అతన్ని అనుసరిస్తూ ధనశ్రీ వర్మ డ్యాన్స్‌ చేసింది. ఇద్దరూ కలిసి 4-5 స్టెప్పులు ఇరగదీశారు. కొరియోగ్రాఫ‌ర్ అయిన ధనశ్రీ.. ధావ‌న్‌ను అనుకరించడం విశేషం. భారత్, ఇంగ్లండ్ సిరీస్ సంద‌ర్భంగా చాహ‌ల్‌తోనే ఉన్న సంద‌ర్భంలో ధ‌న‌శ్రీ ఈ డ్యాన్స్ వీడియో చేసింది. ఇదివరకే టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)తో కలిసి‌ ధనశ్రీ డాన్స్ చేసిన విషయం తెలిసిందే. 'రోసెస్' సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశారు. కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ కంటే కూడా శ్రేయస్‌ బాగా వేశాడు.

    ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్‌.. ఐపీఎల్‌ 2021 సీజన్‌కు సిద్ధమయ్యాడు. వన్డే సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 169 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ధావన్‌ నూతనోత్సాహంతో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ కోసం ఆటగాళ్ల బయోబబుల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

    ఇది కూడా చదవండి : IPL 2021 : మూడోసారి కూడా రిపీట్‌ అయితే ఇక అంతే సంగతులు.. బీసీసీఐ కొత్త రూల్..



    ఇంగ్లండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో చేరడానికి వెళ్లగా..ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోకి వెళ్లాడు. ఇక డాక్టర్ కావాలని ఆశపడిన ధనశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన వీడియో నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. డిసెంబర్ నెలలో టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ ను పెళ్లి చేసుకుంది ధనశ్రీ వర్మ. కరోనా ఎఫెక్ట్ తో వీరిద్దరి పెళ్లి చడీచప్పుడు కాకుండా జరిగిపోయింది.
    Published by:Sridhar Reddy
    First published: