పంత్‌‌‌పై చాహల్ ఫన్నీ కామెంట్‌.. నెట్టింట్లో వైరల్


Updated: July 2, 2020, 12:19 PM IST
పంత్‌‌‌పై  చాహల్ ఫన్నీ కామెంట్‌.. నెట్టింట్లో వైరల్
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో యజ్వేంద్ర చహాల్, విరాట్ కొహ్లీ ( ICC/ Twitter )
  • Share this:
యువ ఆటగాళ్ళు యుజువేంద్ర చాహల్,రిషభ్‌ పంత్‌ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియో నేట్టింట్లో వైరల్‌గా మారింది. మామూలుగానే చిలిపి పనులు చేసే చాహల్ తన తుంటరి చేష్టతో వికెట్‌కీపర్‌,బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ను కవ్వించాడు. స్ట్రెంత్‌ కోచ్‌ నిక్‌వెబ్‌ నేతృత్వంలో పంత్‌ బాక్సింగ్‌ చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను తాజాగా యూజీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో పంత్‌ పంచ్‌ విసురుతుంటే పక్కన ఉన్న చాహల్ అతన్ని అనుకరించాడు. అయితే అది పాత వీడియో అయినప్పటికీ యూజీ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. "పంత్‌ ఎందుకు అలిసిపోతున్నావు ఇది నా ట్రేనింగ్" అనే క్యాప్షన్‌‌ను కూడా జతచేశాడు. ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీనికి పంత్‌ సైతం స్సందించాడు. నవ్వుతున్న ఎమోజీతో ఆ వీడియోకు రిప్లై ఇచ్చాడు.

 
 View this post on Instagram
 

Pant bhaiya kyon thaq rahe ho 🤣🤣 #mytraining 👀👀


A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on


కరోనా వైరస్ కారణంగా ఎలాంటి టూర్స్ లేకపోవడంతో ఆటగాళ్లంతా ఎవరింట్లో వారే ఉంటున్నారు. ఇంట్లో ఉంటూ ఇలా పాత అనుభవాలను  నెమరు వేసుకుంటున్నారు. ఇలానే చాహల్ కూడా పాత అనుభవాన్ని అభిమానులనతో పంచుకున్నారు. ఇంకేందుకు అలస్యం మీరు ఆ వీడియోను  చూసేయండి.
First published: July 2, 2020, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading