Home /News /sports /

YUZVEDRA CHAHAL AND DHANASHREE VERMA SPECIAL REPUBLIC DAY PERFORMANCE GOES VIRAL SRD

Republic Day 2021: దేశ ప్రజలకు తమ స్టైల్లో రిపబ్లికే డే విషెస్ చెప్పిన చాహల్ దంపతులు..వైరల్ వీడియో

Photo Credit : iNSTAGRAM

Photo Credit : iNSTAGRAM

Republic Day 2021 : భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటోంది. భారతీయులకు సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 71 ఏళ్లు పూర్తవగా... నేడు 72వ ఏట అడుగుపెడుతూ... దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమదైన రితీలో జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు. ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
    భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటోంది. భారతీయులకు సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 71 ఏళ్లు పూర్తవగా... నేడు 72వ ఏట అడుగుపెడుతూ... దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమదైన రితీలో జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు. ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. చాహల్ దంపతులు కూడా తమదైన స్టైల్ దేశ ప్రజలకు రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు. చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ బసంతి సినిమాలో సాంగ్ కు స్టెప్పులు వేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను వీరిద్దరూ తమ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరలవుతోంది. షేర్ చేసిన కొద్ది సేపటికే ఈ వీడియోకు లైకుల వర్షం కురుస్తోంది. ఈ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భార్యభర్తలిద్దరూ ఈ స్టైల్ లో విషెస్ చెప్పడంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.



    టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ గత నెలలో ఓ ఇంటివాడైనా సంగతి తెలిసిందే. నూతన జీవితంలోకి అడుగుపెట్టిన చాహాల్‌,ధనుశ్రీ జంట తమ హనీమూన్‌ ను ఏడారి దేశం దుబాయ్ లో ఎంజాయ్ చేసింది. వీరిద్దరి వివాహం గతనెల 22న గురుగ్రామ్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో గుడిచప్పుడు కాకుండా వీరిద్దరి వివాహం జరగడంతో.. పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఫోటోలు, వీడియోల్ని అభిమానులతో పంచుకుంటోంది చాహల్-ధనశ్రీల జంట.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Instagram, Republic Day 2021

    తదుపరి వార్తలు