భార్యకు యువరాజ్ స్వీట్ పోస్ట్... ఫ్యాన్స్ గ్రీటింగ్స్

Yuvraj Singh : మూడేళ్ల వివాహ బంధం... 30 ఏళ్ల అనుబంధంలా ఉందని యువరాజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: December 1, 2019, 9:02 AM IST
భార్యకు యువరాజ్ స్వీట్ పోస్ట్... ఫ్యాన్స్ గ్రీటింగ్స్
భార్యకు యువరాజ్ స్వీట్ పోస్ట్... (credit - insta - yuvisofficial)
  • Share this:
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచీ రిటైర్ అయిన తర్వాత యువరాజ్ సింగ్... ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతూ పండగ చేసుకుంటున్నాడు. గ్లోబల్ టీ20 కెనడా కాంపిటీషన్‌లో ఆడిన యువీ... తాజాగా... అబూ దాబీలో టీ10 లీగ్ ఆడాడు. ఈ మాజీ ఆల్ రౌండర్... శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య హాజెల్ కీచ్‌కి మూడో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మూడేళ్లు... 30 ఏళ్లులా ఉన్నాయంటూ... తన భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. యూవీ ఫొటోకి ఫ్యాన్స్ నుంచే కాదు... ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్ల నుంచీ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా... భార్యభర్తలకు కంగ్రాట్స్ చెబుతున్నారు. యూవీ మాజీ టీమ్ మేట్ హర్భజన్ సింగ్, ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, తాజా టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్... వీళ్లంతా యువరాజ్ పోస్ట్‌పై స్పందించారు. బాలీవుడ్ యాక్టర్, నిర్మాత ఫర్హాన్ అక్తర్, బిపాసా బసు, సునీల్ గ్రోవర్... ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌కి గ్రీటింగ్స్ చెప్పారు.
View this post on Instagram

Mubarak ho biwi ! We made it to 3 years 🤪 feels like 30 😅😂 ! Happy anniversary my love ❤️😘 @hazelkeechofficial


A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

టీ10 లీగ్‌లో మొదటిసారి చేరిన యువరాజ్... తన వైపు టీమ్ మరాఠా అరేబియన్స్ టోర్నమెంట్ గెలవడంతో ట్రోఫీ సాధించాడు. ఫైనల్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఓటమి చూశారు.


Pics : క్యూట్ స్మైల్ బ్యూటీ కనిహ లేటెస్ట్ స్టిల్స్
ఇవి కూడా చదవండి :

సంజయ్‌దత్‌కి ఏమైంది... షాకవుతున్న నెటిజన్లు

Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన

పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
Published by: Krishna Kumar N
First published: December 1, 2019, 9:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading