• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YUVRAJ SINGH SLAMS MANAGEMENT FOR INDIAS WORLD CUP SEMI FINAL DEFEAT SB

టీమిండియా యాజమన్యంపై యువీ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా యాజమన్యంపై యువీ సంచలన వ్యాఖ్యలు

యువరాజ్ సింగ్

విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌ వంటి అనుభవం లేని వారిని వరల్డ్ కప్ టోర్నీలకు ఎంపిక చేయడం ఏంటని యువరాజ్ ప్రశ్నించారు.

  • Share this:


    భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ టీమ్ ఇండియా యాజమాన్యంపై పలు విమర్శలు చేశాడు.  2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి యాజమాన్యం అవలంబించిన విధానం పూర్తిగా తప్పన్నాడు యువరాజ్.  మిడిల్‌ ఆర్డర్‌లో అనుభవం లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమే జట్టు ఓడిపోవడానికి కారణమైందన్నాడు. మంగళవారం యువీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమిండియా ఓటమిపై పలు అంశాల్ని వెల్లడించాడు.  టాప్‌ ఆర్డర్‌కు అనుగుణంగా మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయిందని యువీ విమర్శించాడు.

    అంబటి రాయుడు విషయంలో కూడా యాజమాన్యం విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌ వంటి అనుభవం లేని వారిని ప్రపంచకప్‌ టోర్నీలకు ఎంపిక చేయడం ఏంటని యువరాజ్ ప్రశ్నించారు. అలా అని ఆయన వారికి వ్యతిరేకంగా మాట్లాడం లేదని.. వారికి కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన అనుభవం ఉందన్నాడు. అలా తక్కువ అనుభవం ఉన్న వారి నుంచి మంచి ఆటను ఎలా ఊహించగలం అన్నారు. జట్టు విషయంలో యాజమాన్యం సరైన ప్రణాళికలు తీసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిందన్నాడు యువరాజ్‌సింగ్‌.





    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు