• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YUVRAJ SINGH SHARES A VIDEO OF SWAN CLEANING PLASTIC WASTE MK

పక్షులను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి...యువరాజ్ సింగ్ ట్వీట్...

పక్షులను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి...యువరాజ్ సింగ్ ట్వీట్...

యువరాజ్ సింగ్

వీడియోలో ఓ హంస నీటిలోని ప్లాస్టిక్ కవర్లను వేరు చేస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ వీడియో ద్వారా పక్షుల నుంచి అయినా మనం నేర్చుకుందాం అంటూ యూవీ ట్వీట్ చేశాడు.

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా ముంచుకొస్తున్న ముప్పుపై దేశాధ్యక్షుల మొదలు పలువురు సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యంపై ఓ వీడియో షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ హంస నీటిలోని ప్లాస్టిక్ కవర్లను వేరు చేస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ వీడియో ద్వారా పక్షుల నుంచి అయినా మనం నేర్చుకుందాం అంటూ యూవీ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. ఈ వీడియోకు ఇప్పటికే 4500 లైక్స్ తో పాటు, 900 రీట్వీట్‌లు లభించాయి. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోదీ సైతం మహబలిపురంలో సముద్రతీర ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరి దేశ వ్యాప్తంగా స్ఫూర్తి నింపడంతో, ఇప్పుడిప్పుడే సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా వచ్చి మద్దతు ఇస్తున్నారు.

     

    Published by:Krishna Adithya
    First published: