• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YUVRAJ SINGH SAYS CRICKET WILL BENEFIT FROM INDIA AND PAKISTAN PLAYING MORE AGAINST EACH OTHER MK

Yuvraj Singh: భారత్, పాకిస్థాన్ సిరీస్‌పై యువీ ఆసక్తికర వ్యాఖ్యలు

Yuvraj Singh: భారత్, పాకిస్థాన్ సిరీస్‌పై యువీ ఆసక్తికర వ్యాఖ్యలు

యువరాజ్ సింగ్

Yuvraj Singh: ఇండియా, పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్‌ జరిగితే.. అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుందని యువరాజ్ (Yuvraj Singh) పేర్కొన్నాడు.

  • Share this:
    Yuvraj Singh: భారత్, పాకిస్థాన్(India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక క్రికెట్ (cricket) సిరీస్‌ జరగాలని టీం ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. ఓ కార్యక్రమంలో యువీ మాట్లాడుతూ.. 2004, 2006, 2008 పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడామని గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ జరిగితే.. అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుందని యువరాజ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ప్రపంచ క్రికెట్‌లో ఫార్మేట్‌ ఏదైనా భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరును అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ళు యుధ్ధంలా భావిస్తారు. ఆట కంటే భావోద్వేగాలకే ఈ మ్యాచ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇండియా పాక్ మ్యాచ్ అంటే టికెట్ల కోసం అభిమానులు క్యూ కడతారు. జనాలంతా టీవీలకు అతుక్కు పోతారు.. రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి. మ్యాచ్ జరిగే స్టేడియాలు జనాలతో నిండిపోతాయి. ఆటగాళ్లు, అభిమానులు దాన్ని యుద్ధంలా భావిస్తారు.

    మరి అలాంటి మ్యాచులు ప్రస్తుతం ఐసీసీ టోర్నీలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇరు దేశాల మధ్య ముంబై దాడుల తర్వాత క్రికెట్ బంధం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే ఇప్పుడిప్పుడే సచిన్ టెండూల్కర్, వసీం అక్రం లాంటి వాళ్లు ముందుకొచ్చి ఇరుద దేశాల క్రికెట్ సంబంధం చిగురించాలని కోరుకుంటున్నారు.
    Published by:Krishna Adithya
    First published: