• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • YUVRAJ SINGH S NEW LOOK VIRAL IN SOCIAL MEDIA SHIKHAR DHAWAN IRFAN PATHAN AND OTHERS COMMENT SA

Yuvraj Singh: ఎంటీ యువీ ఇలా మారిపోయాడు.. వైరల్ అవుతున్న ఫోటో!

Yuvraj Singh: ఎంటీ యువీ ఇలా మారిపోయాడు.. వైరల్ అవుతున్న ఫోటో!

yuvaraj sing

రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో రెచ్చిపోయాడు యువీ. అనాటి రోజులను మరిపిస్తూ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఇండియా లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు.

  • Share this:
    క్రికెట్ చిచ్చర పిడుగు యువరాజ్ నయా ట్రెండింగ్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే యువరాజ్ సింగ్.. బయట కూడా ట్రెండింగ్ లుక్స్,చిలిపి కామెంట్స్‌తో అభిమానులు అలరిస్తుంటాడు. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. తాజాగా యువీ తన న్యూలుక్‌ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి ఫ్యాన్స్ కామెంట్స్,లైక్స్ చేస్తూ విపరీతంగా షేరు చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు టీమిండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా " భాయ్ బాద్ షా లా మారావు " అంటూ కామెంట్ చేశారు.

    యువరాజ్ వయసు పెరుగుతున్నప్పటికి అతనిలో మాత్రం సత్తా తగ్గడంలేదు. తాజాగా జరిగిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో రెచ్చిపోయాడు యువీ. అనాటి రోజులను మరిపిస్తూ హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఇండియా లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు.

    ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 170.17 స్ట్రయిక్‌ రేట్‌తో 194 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా కూడా నిలిచాడు. మొత్తం 17 సిక్సర్లు బాది ఆదరాహో అనిపించాడు. ఇక వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. వరుస సిక్సులు చూసిన వారు మళ్ళీ ఆరు సిక్స్‌లు బాదుతాడోమోనని అనుకున్నారు. ఇక శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సైతం యువీ రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి తన సత్తా చాటాడు.

    ఇక  రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్   టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ అదరగొట్టారు. రిటైర్డ్‌ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టి20 క్రికెట్‌ టోర్నీ కప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. యూసుఫ్‌ పఠాన్‌ (36 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు)... యువరాజ్‌ సింగ్‌ (41 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. సచిన్‌ టెండూల్కర్‌ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది
    Published by:Rekulapally Saichand
    First published: